రీ రిలీజ్ కాబోతున్న ఎన్టీఆర్ ప్లాప్ సినిమా...!!

murali krishna
తెలుగు రాష్ట్రాల ప్రజలు సినిమాను ఎంతగా ఆదరిస్తారో అందరికీ కూడా తెలిసిందే. హీరోలను కూడా తమ ఇంట్లో వారిగా చూస్తుంటారు. అందుకే వారిని ఆ విధముగా అభిమానిస్తూ ఉంటారు వారు.అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ అయితే నడుస్తోంది. అదే రీ రిలీజ్ ట్రెండ్.అంటే గతంలో వచ్చిన సినిమాలను మళ్లీ విడుదల చేయడం .
ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటించిన ఖుషి, జల్సా, మహేశ్ బాబు పోకిరి మరియు వెంకటేశ్ నారప్ప అలాగే బాలకృష్ణ చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమాలు మళ్ళీ విడుదల అయి మంచి కలెక్షన్లు అయితే వసూలు చేశాయి. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతోందని సమాచారం.ఆ హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఫ్యాన్స్ ఈ మేరకు ఆ సినిమా రీ రిలీజ్ కు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.ఇంతకీ ఆ సినిమా ఏమిటి అంటే..
గతంలో ఎన్టీఆర్‌ నటించిన ఆంధ్రావాలా సినిమా గురించి అందరికీ బాగా తెలుసు.. ఈ సినిమా ఆడియో విడుదల ఈవెంట్ కు అప్పట్లో ఏకంగా 15లక్షల మంది అభిమానులు రావడం అప్పట్లో ఓ చరిత్రగా మిగిలింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి మంచి క్రేజ్ అయితే ఉంది. అందుకే ఈ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా లో ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్ కు అప్పట్లో మంచి క్రేజ్ అయితే దక్కింది. అయితే కలెక్షన్ల పరంగా అప్పట్లో ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది.మరి ఎన్టీఆర్‌ కెరీర్‌ లో ఎన్నో హిట్ సినిమాలు అయితే ఉండగా.. ఈ మూవీనే ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదటా.మరి విడుదల అయ్యాక ఎంత వసూలు చేస్తుందో ఆయితే చూడాలి. ఈ సినిమా ఈ నెలలోనే రీ రిలీజ్ కాబోతోందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: