లిప్ లాక్ టీజర్ తో దుమ్ము రేపుతున్న 'యాటిట్యూడ్ స్టార్ '.....!!

murali krishna
టాలీవుడ్ బుల్లితెర మెగాస్టార్గా పిలవబడే ప్రభాకర్ తన కొడుకును హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈటీవీ ప్రభాకర్ గా కూడా ఫేమస్ అయిన ఈ నటుడుకి యాటిట్యూడ్ ఎక్కువనే పేరుంది. కాగా తండ్రి యాటిట్యూడ్ కి పదింతలు కొడుకు చంద్రహాసన్ లో ఉన్నట్లుండి. మొదటిసారి మీడియా ముందుకు వస్తూనే చంద్రహాస్ తన మార్క్ చూపించాడు. ఓ పది బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరో రేంజ్ లో ఫోజు కొట్టాడు. జేబులో చేతులు పెట్టి, జుట్టు సరి చేసుకుంటూ వీర లెవల్లో యాటిట్యూడ్ చూపించాడు. చంద్రహాస్ లాంచింగ్ ఈవెంట్ కి వచ్చిన మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ఒక్క సినిమా కూడా చేయకుండానే ఈ యాటిట్యూడ్ ఏంట్రా బాబు అని అసహనం వ్యక్తం చేశారు.
ఆ దెబ్బతో యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు ఇచ్చేశారు. శాక్రిఫైజ్ స్టార్, ఆవేశం స్టార్ మాదిరి యాటిట్యూడ్ స్టార్ అన్నమాట. చంద్రహాస్ సిల్వర్ స్క్రీన్ మీద ఏ మేరకు రాణిస్తాడో తెలియదు కానీ యాటిట్యూడ్ స్టార్ గా పిచ్చ ఫేమస్ అయ్యాడు. పదుల సంఖ్యలో ట్రోలింగ్ వీడియోలు పుట్టుకొచ్చాయి. చంద్రహాస్ పెద్ద ఎత్తున సోషల్ మీడియా విమర్శలకు గురయ్యాడు. తన మాటల్లో ఆత్మవిశ్వాసం కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా కనిపించింది. ఒకటికి నాలుగు సినిమాలు చేస్తున్నానని చెప్పిన చంద్రహాస్ ఏదేమైనా ఇండస్ట్రీని వదిలేది లేదని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు.
చంద్రహాస్ విపరీతమైన ట్రోల్స్ కి గురైన నేపథ్యంలో తండ్రి ప్రభాకర్ స్పందించారు. ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మంచో చెడో ప్రచారమైతే వచ్చిందని మరో ప్రక్క ఆనందం వ్యక్తం చేశాడు. తమకు చంద్రహాస్ అపురూమని, మా అబ్బాయిని ట్రోల్ చేయవద్దని వేడుకున్నాడు. అదే సమయంలో వార్నింగ్ కూడా ఇచ్చాడు. మితిమీరి ప్రవర్తిస్తే కేసులు పెడతానని బెదిరించారు. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఇంత రచ్చ చేసిన చంద్రహాస్ సిల్వర్ స్క్రీన్ మీద ఏ మాత్రం ఇరగదీస్తాడో చూడాలన్న ఆత్రుత అందరిలో ఉంది.
కాగా చంద్రహాస్ ఫస్ట్ మూవీగా బోల్డ్ జోనర్ ఎంచుకున్నారు. ఫారిన్ అమ్మాయితో ప్రేమలో పడే యువకుడిగా కనిపించనున్నాడు. కేట్ అనే విదేశీ భామ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. బ్లాక్ డాగ్ ఫర్ ఏ వైట్ చిక్ అనేది సినిమా టైటిల్. ఈ చిత్ర టీజర్ విడుదలైన నేపథ్యంలో జనాలు మండిపడుతున్నారు. ఏందీ ప్రభాకర్ మీ అబ్బాయిని పోర్న్ స్టార్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నావా? అని ఎద్దేవా చేస్తున్నారు. టీజర్ బోల్డ్ సీన్స్ తో నిండిపోయింది. చంద్రహాస్ హీరోయిన్ కేట్ తో లిప్ లాక్ లు బాగా లాగించాడు. బ్లాక్ డాగ్ ఫర్ ఆ వైట్ చిక్ టీజర్ వైరల్ అవుతుంది.
మొదట్లోనే ఇలాంటి సినిమాలు ఎంచుకున్నందుకు అతనికున్న గట్స్ గురించి నెటిజన్లు ఈ న్యూస్ ను తెగ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: