ఆ మూవీ కోసం బాలీవుడ్ సంస్థ అంత పెట్టుబడి పెట్టిందా....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ పేరును పాన్ ఇండియా స్థాయి కి చేర్చిన మొట్ట మొదటి తెలుగు స్టార్ ఎప్పటికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కె దక్కుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఐతే ఆయన  ప్రెజెంట్ అనేక భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు.ఈయన బాహుబలి తర్వాత మళ్ళీ అంతటి రేంజ్ లో హిట్ అందుకోలేక పోయాడు.
సాహో, రాధేశ్యామ్ సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యాయి. దీంతో ఈ సినిమా తర్వాత డార్లింగ్ నుండి వచ్చే సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరి ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ముందుగా రిలీజ్ కాబోతున్న మూవీ 'ఆదిపురుష్'. ఈ సినిమా జూన్ 16న వాల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది..అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.
ఐతే రామాయణం తెరకెక్కించడం కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఐనా టి సిరీస్ సంస్థ దాదాపుగా 500 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ మోస్ట్ ఏవైటెడ్ మూవీ జనవరిలో రిలీజ్ అవ్వాల్సి ఉండగా జూన్ కు వాయిదా పడింది.జూన్ 16న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు.ఈ సినిమా ట్యాగ్ ను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తూ సోషల్ మీడియాను పూర్తిగా తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ కు గాను ఇంకా కేవలం 100 రోజులు మాత్రమే ఉండడంతో గతంలో సలార్ లాగానే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసారు.దీంతో ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడంతో ఈ సినిమాపై ఇప్పటికీ అంచనాలు బాగానే ఉన్నాయని అర్ధం అవుతుంది.
ఏదేమైనా ప్రభాస్ అభిమానులు ఈ మూవీ వందకు వంద శాతం బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నీ రికార్డ్స్ ను కొళ్లగొడుతుందని వాళ్ళు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: