"ఆర్సి 15" కు ఆర్ క్రేజీ టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టేనా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆయన స్టార్ పవర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రెండవ మూవీ తోనే రామ్ చరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులు అన్నింటిని బద్దలు కొట్టి మగధీర మూవీ తో సరికొత్త రికార్డులను సృష్టించాడు. అలా మగధీర మూవీతో అద్భుతమైన రికార్డులను సృష్టించిన రామ్ చరణ్ ఆ తర్వాత రంగస్థలం మూవీతో మరోసారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" అనే మూవీ లో హీరోగా నటించి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా ఇప్పటికే నటుడిగా అద్భుతమైన క్రేజీను సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎస్ జె సూర్య ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో కియార అద్వానీ  హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ ఈ మూవీ లో ఇతర ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు.  

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అయినప్పటికీ ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రకరణ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ టైటిల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు "సీఈవో" అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు ... ఆల్మోస్ట్ ఈ టైటిల్ నే కన్ఫామ్ చేసే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: