ఈ ఏడాది మా ఆయనదే: ఉపాసన

Purushottham Vinay
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల జంటకు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక ఓవైపు చరణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండగా.. మరోవైపు ఉపాసన కూడా తమ బిజినెస్ విషయాల్లో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంటారు. కానీ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలతోపాటు ఇంకా అలాగే సినిమాలకు సంబంధించి అన్ని ప్రోగ్రామ్స్ లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు ఉపాసన. ఎల్లప్పుడూ తన భర్త చరణ్ వెన్నంటే ఆమె కూడా ఉంటారు. రీసెంట్‌గా ఇండియా ప్రపంచ దేశాల్లో జరిగిన ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్లో కూడా ఆయన వెన్నంటే ఉపాసన నడిచారు.ఫారెన్లో జరిగిన ప్రతీ ఈవెంట్లో ఇంకా ఇంటర్య్వూలో.. ఇంటర్నేషనల్ అవార్డు సెర్మనీలో ఉపాసన ఆయనతోనే ఉన్నారు. రామ్ చరణ్ ని చీరప్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే తన భర్త గురించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు ఉపాసన.


ఈ సంవత్సరం చెర్రీ నామ సంవత్సరం అంటూ చెప్పారు. తనకి హార్డ్‌ కోర్ ఫ్యాన్‌గా మారిపోయానని చెప్పారు.ఉపాసన మాట్లాడుతూ..“నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో కూడా రామ్ చరణ్ నాకు సపోర్ట్ గా నిలిచారు. అలాగే నేను కూడా చెర్రీకి అన్ని విషయాల్లో సపోర్ట్ గా ఉంటాను. నాటు నాటు పాట షూటింగ్ కోసం ఉక్రెయిన్ వెళ్లినప్పుడైనా ఇంకా ఇంట్లో ఉన్నా.. ఇంకా అలాగే షూటింగ్ అంటూ బిజీగా గడుపుతున్నప్పుడైనా ఇలా ప్రతి విషయంలో కూడా నేను చెర్రీకి వెన్నంటే ఉన్నా్ను. ఎలాంటి సందర్భంలోనైనా తనకు నేను శాయశక్తుల సహాయం చేస్తుంటాను. ఇక చెర్రీకి ఈ సంవత్సరం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తన వర్క్ పరంగా కూడా చాలా సంతృప్తిగా ఉన్నాడు. ఈ సంవత్సరం రామ్ చరణ్ ఎన్నో ప్రసంశలు అందుకున్నారు. ఈ సంవత్సరం తనదే ” అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: