సమంతతో ఫోన్ మాట్లాడుతుంటా ... దగ్గుబాటి రానా..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటుడు అయినటు వంటి దగ్గుపాటి రానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లీడర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ హీరో ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ... ఎన్నో మూవీ లలో ఇతర ముఖ్య పాత్రలలోనూ నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం రానా ... ప్రభాస్ హీ రోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటు వంటి బాహుబలి మూవీ లో విలన్ పాత్రలో నటించి పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రానా ... వెంకటేష్ తో కలిసి రాణా నాయుడు అనే వెబ్ సీ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మరి కొన్ని రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్  దగ్గర పడుతున్నడంతో రానా ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లలో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా తాజాగా రానా ... సమంత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రానా మాట్లాడుతూ ... టైమ్  దొరికినప్పుడల్లా సమంత తో మాట్లాడుతాను అని చెప్పుకొచ్చాడు. సమంత మయోసైటిస్ పారిన పడిన విషయం తెలియ గానే ఫోన్ చేసి తన యోగక్షేమాలను తెలుసుకున్నాను అని వివరించాడు.

నటీనటులు తమకు ఉన్న సమస్యల గురించి ప్రపంచానికి చెప్పాలా ... లేదా అనేది వారి వ్యక్తిగత విషయమని ... ప్రతి ఒక్కరి జీవితం లో కష్టాలు ఉంటాయి అని ... వాటిని ఎదుర్కొని ముందుకు సాగడం లోనే ఆనందం ఉంటుంది అని రానా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే వెంకటేష్ ... రాణా కలిసి నటిస్తున్న రానా నాయుడు వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: