హాట్ టాపిక్ గా మారిన లావణ్య త్రిపాఠి తెలివిగల మాటలు !

Seetha Sailaja

‘అందాల రాక్షసి’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి మంచి నటిగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆమెకు సరైన అవకాశాలు రాలేదనే కొందరి అభిప్రాయం. ప్రస్తుతం ఆమె నటించిన ‘పులి మేక’ వెబ్ సిరీస్ ఓటీటీ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో ఆమె నటనకు మంచి ప్రశంసలు కూడ లభిస్తున్నాయి.

గత కొంతకాలంగా ఆమె మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తో సన్నిహితంగా ఉంటోందని త్వరలో వారిద్దరి పెళ్ళి జరుగుతుందని కొన్ని మీడియా సంస్థలలో గాసిప్పులు వస్తున్నాయి. ఈ గాసిప్పులను వరుణ్ తేజ్ కానీ లావణ్య కానీ ఖండించక పోవడంతో ఈవార్తలలో నిజం ఉందా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తు ఆమధ్య నాగబాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ పెళ్ళి గురించి అతడే స్వయంగా ప్రకటన చేస్తాడు అని కామెంట్ చేయడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది.

లేటెస్ట్ గా స్ట్రీమ్ అవుతున్న ‘పులి మేక’ వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లావణ్య కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసింది. తన పెళ్ళి గురించి మాట్లాడుతూ తన పెళ్ళి సరైన వ్యక్తితో సరైన సమయంలో జరుగుతుందని దీన్ని గురించి ఖంగారు పడటంలేదు అంటు కామెంట్ చేసింది.

అంతేకాదు చాలామంది అమ్మాయిలు లా తాను పెళ్ళి గురించి కలలు కంటూ పెళ్ళి రోజున తాను ఎలాంటి నగలు పెట్టుకోవాలి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అన్న కలలతో తన సమయాన్ని వృధా చేసుకోనని సమయం వచ్చినప్పుడు మాత్రమే తాను పెళ్ళి గురించి ఆలోచిస్తాను అని కామెంట్స్ చేసింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చి 10 సంవత్సరాలు దాటిపోవడంతో చాలామంది తన పెళ్ళి గురించి వార్తలు వ్రాస్తూ ఉంటారని అయితే తనకు కెరియర్ ముఖ్యం అంటూ తెలివిగా మాట్లడింది లావణ్య త్రిపాఠి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: