సూర్య 42వ సినిమాకు ఏకంగా అన్ని కోట్ల బిజినెస్..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో అయినటు వంటి సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న సూర్య ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీలను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా సూపర్ క్రేజ్ ను దక్కంచుకున్నాడు. గజిని మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును దక్కించుకున్న సూర్య అప్పటి నుండి తాను నటించిన దాదాపు ప్రతి సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తూ వస్తున్నాడు.

అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ హిట్ లను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య తన కెరియర్ లో 42 వ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని సూర్య కెరియర్ లోనే ఇప్పటి వరకు ఏ మూవీ కి పెట్టనంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దానితో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇలా భారీ బడ్జెట్ తో తేరకెక్కుతున్న ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ కి 500 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఎలాంటి ఫస్ట్ లుక్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేయలేదు. అయినప్పటికీ ఈ మూవీ కి ఈ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా ఏ రేంజ్ అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: