దూసుకొచ్చేస్తున్న మాస్ మహారాజా రవితేజ..!

Divya
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ మహారాజా దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తన పర్ఫామెన్స్ తో యువతను ఆకట్టుకోవడమే కాకుండా మాస్ ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తూ ఉంటాడు. అంతేకాదు సినిమాలలో అప్పుడప్పుడు కామెడీ చేస్తూ అటు కామెడీ ఆడియన్స్ ని కూడా అలరించే రవితేజ ఇప్పుడు ఈ వయసులో కూడా వరుసగా ఒకటి తరువాత మరొకటి సినిమాలలో అనౌన్స్ చేస్తూ జెడ్ స్పీడ్ లో దూసుకుపోతూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు.
గత ఏడాది చివర్లో ధమాకా సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి సినిమాకి ఊపిరి పోశారు. అలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ ఇప్పుడు మరో రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టారు. ఇప్పుడు తాజాగా ఆయన నుంచి విడుదలవుతున్న సినిమా రావణాసుర. రావణాసుర ఏప్రిల్ ఏడవ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతోంది ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. ఇప్పుడు సినిమా కంప్లీట్ అయ్యి వారం కూడా కాలేదు అప్పుడే తన తదుపరి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు మాస్ మహారాజా రవితేజ.
ఇందుకోసం భారీగా వైజాగ్ లో సెటప్ కూడా వేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టి..  ఫినిష్ చేసి విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు రవితేజ . దీన్ని బట్టి చూస్తే వరుస సినిమాలతో ఆయన దూసుకొస్తున్నట్లు తెలుస్తోంది ఒకటి సినిమా తర్వాత మరొక సినిమా చేస్తూ అభిమానులకు ఎప్పటికప్పుడు మంచి వినోదాన్ని పంచుతున్నాడు. ఏది ఏమైనా రవితేజ ఇప్పుడు ఇలా తన కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా జెడ్ స్పీడ్ లో దూసుకుపోతూ ఉండడం నిజంగా హర్షదాయకమని చెప్పాలి. మరి ఈ సినిమాలతో రవితేజ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: