NTR -30: జాన్వీ కపూర్ అప్డేట్.. క్లారిటీ ఇచ్చేనా..?

Divya
ఎన్టీఆర్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన rrr చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించారు. ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న మరణంతో గత కొద్దిరోజులుగా షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు కార్యక్రమానికి కూడా ఇంకా హాజరు కాలేదు. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ 30 వ సినిమా బాధ్యత డైరెక్టర్ కొరటాల శివకు అప్పగించారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంపై ఈ రోజున క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఈ రోజున జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో జాన్వి కపూర్ణ హీరోయిన్గా ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కచ్చితంగా ఈ సినిమాలో జాన్వి కపూర్ నటిస్తే అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా ఈరోజు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. చిత్ర బృందం అందుకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా లాంచింగ్ను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ అమెరికాకు వెళ్ళబోతున్నట్లు సమాచారం అక్కడ HCA నుంచి తనకు రావాల్సిన అవార్డును కూడా అప్పుడే తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికి ఈ అవార్డు రామ్ చరణ్ కూడా అందుకున్నారు.

ఎన్టీఆర్ 30 సినిమా పాన్ ఇండియా లేబర్లోనే నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది కొరటాల శివ ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సినిమా ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభం అయ్యేది కానీ తారకరత్న మృతితో ఈవెంట్రుకలు రద్దు చేసినట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో సాయి అలీ ఖాన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి అన్ని విధాల క్లారిటీ ఇచ్చేందుకు త్వరలోనే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: