ఐలవ్యూ అన్నమాట పరువు తీస్తున్న హైపర్ ఆది..!

shami
ఐలవ్యూ ఇది ఎంత పవిత్రమైన పదం.. ఒక మనిషిని ఇష్టపడుతున్నామని కేవలం ఒకే ఒక్కసారి లేద ఒకే మనిషికే ఎన్ని సారైనా చెప్పే మాట. కానీ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఈ మాట తనకు కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పి ఈ మాటకు ఉన్న పరువుని తీస్తున్నాడు. అక్కడ జబర్దస్త్ లో కొత్తగా వచ్చిన యాంకర్ సౌమ్యా రావుతో పులిహోర కలుపుతున్న హైపర్ ఆది మరోపక్క ఢీ డ్యాన్స్ షోలో శ్రద్ధా దాస్ కి లైన్ వేస్తున్నాడు. అంతేకాదు ఈ షోలో హైపర్ ఆది శ్రద్ధా దాస్ కి ఐలవ్యూ అంటూ సీరియస్ గా కూడా చెప్పాడు.
అసలు ఐలవ్యూ అన్న పదం ఎంత ఎమోషనల్ వర్డ్.. దాన్ని కూడా కామెడీ చేసేస్తున్నాడు హైపర్ ఆది. అఫ్కోర్స్ ఆడియన్స్ కి కూడా అతను కామెడీ కోసమే ఇదంతా చేస్తున్నాడని తెలిసినా. ఒకవేళ రేపు హైపర్ ఆదికి నిజంగానే ఒక అమ్మాయి నచ్చి సీరియస్ గా ఐలవ్యూ అని అతను చెప్పినా కెమెరాలు ఎక్కడ పెట్టారు.. ప్రాంక్ వీడియోనా అన్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆడియన్స్ ని నవ్వించాలన్న ఉద్దేశంతో హైపర్ ఆది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా.. అతను అనే చిన్న చిన్న మాటలను పట్టుకుని నానా గోల చేస్తుంటారు కొందరు.
అటు జబర్దస్త్, ఇటు ఢీ రెండు షోలను హైపర్ ఆది కవర్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఈమధ్య మళ్లీ జబర్దస్త్ కి క్రేజ్ ఇచ్చిన అతను తిరిగి రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడన్నది తెలియాల్సి ఉంది. రీసెంట్ గా ధనుష్ సార్ లో కూడా మంచి పాత్ర దక్కించుకున్న హైపర్ ఆది అటు షోలు ఇటు సినిమాలు అంటూ కెరీర్ లో దూసుకెల్తున్నాడు. సినిమాల్లో ఎన్ని అవకాశాలు వచ్చినా ఢీ షోని మాత్రం వదలదలచుకోలేదు ఆది. మల్లెమాల సంస్థ మీద అతనికి ఉన్న గౌరవం అలాంటిదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: