బాలయ్య అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే..!?

Anilkumar
నందమూరి బాలకృష్ణ 107 వ సినిమా గా వచ్చిన వీర సింహారెడ్డి సినిమా ఎంతటి విజయాన్ని అందుకున్న ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిన్నటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. దీని అనంతరం తర్వాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలై జెట్ స్పీడ్ లో పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది .ఈ క్రమం లోనే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయం  హాట్ టాపిక్ గా మారింది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది దసరాకు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. ఏకంగా ఆరు భాషల్లో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తుంది. ఉగాదికి ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా టైటిల్ ని కూడా విడుదల చేయబోతున్నారట చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎప్పటిలాగే చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో బాలయ్య పాత్ర పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ ఆ పాత్ర పాలకు ప్రవర్తన మాటలు చాలా ఫన్నీగా ఉంటాయని సమాచారం.

ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రి కూతుర్ల మధ్య ఎమోషన్ చాలా బాగుంటుందని తెలుస్తోంది. అంతేకాదు వీరిద్దరి బంధం ఈ సినిమాకి ఆయువు పట్టు అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీ లీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని శ్రీముఖి కూడా ఈ సినిమాలోక కీలకపాత్రలో నటిస్తోందట. బాలయ్య కూతురుగా నటిస్తున్న శ్రీ లీల కి ఫ్రెండ్ పాత్రలో శ్రీముఖి కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు శ్రీముఖి మొదటి నుండి చివరి వరకు సినిమాలో కనిపిస్తుంది అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: