రామ్ చరణ్ వేసుకునే ఒక్కో సూట్ ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..?

Anilkumar
ఈమధ్య సినీ అభిమానులు స్టార్ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హీరోలు పెట్టుకునే వాచీలు కావచ్చు.. వాళ్ళు ధరించే సూట్ లు, డ్రెస్ ల గురించి ఫాన్స్ ఎక్కువగా తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసుకునే సూట్ల గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అయితే ఈమధ్య చరణ్ వరుస ఈవెంట్లకు అటెండ్ అవుతున్నాడు. అంతేకాదు ఇటీవల ఓ హాలీవుడ్ మీడియాతో సైతం రామ్ చరణ్ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం త్రిబుల్ ఆర్ కి సంబంధించిన ఆస్కార్ ఫంక్షన్ లో చరణ్ బిజీగా ఉన్నాడు. 

మార్చి 12 నుండి ఆస్కార్ కి సంబంధించిన ఫలితాలు వెలువడబోతున్నాయి. ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం రామ్ చరణ్ ఇటీవల అమెరికాకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చరణ్ ప్రస్తుతం అమెరికాలో కొన్ని ఇంటర్వ్యూస్, ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. ఇక అక్కడ రామ్ చరణ్ వేసుకునే సూట్ ల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరలవుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన వేసుకున్న సూట్స్ కి ఫిదా అవుతున్న చాలామంది దాని ధర గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునే పనిలోపడ్డారు. అయితే రామ్ చరణ్ ధరించే సూట్స్ అన్ని చెన్నైలోని ఓ ప్రముఖ డిజైనర్ కు చెందినవిగా తెలుస్తోంది. చెన్నైలో సూట్ మేకర్ అయిన ఉస్మాన్ అబ్దుల్ రజాక్ వీటిని డిజైన్ చేశారట.

ఇక రాంచరణ్ ధరించే ఒక్కో సూట్ ధర 13 లక్షల నుండి 70 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి చాలా మంది నేటిజన్లు కేవలం సూట్ కే 70 లక్షల రూపాయలు ఖర్చు పెడతారా?.. అంటూ ఆశ్చర్య పోతున్నారు. ఇక చరణ్ ఫాన్స్ అయితే ఈ విషయం తెలిసి ఫుల్ ఖుషి అవుతూ.. మెగా పవర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సుమారు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: