ఇంస్టాగ్రామ్ ద్వారా సమంత నెల సంపాదన అన్ని రూ. కోట్లా..?
ఇప్పుడిప్పుడే అనారోగ్య సమస్య నుంచి కోలుకోవడంతో తిరిగి మళ్ళీ సినిమా షూటింగ్లలో బిజీ అవుతున్నారు సమంత. ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ వాటిని ఇంస్టాగ్రామ్ లో ప్రమోట్ చేస్తోంది. కేవలం ఇంస్టాగ్రామ్ లో మాత్రమే 24.8 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు సమంత. ప్రత్యేకంగా టాప్ కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా చేస్తుంది.
ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ ద్వారా ఈమె పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ నెలకు ఏకంగా రూ.3 కోట్లు ఆదాయాన్ని అందుకుంటుందని తాజా నివేదికల ద్వారా స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే ఆమె ఒక్కో ప్రమోషనల్ పోస్ట్ కోసం దాదాపు రూ.20 లక్షల వరకు పారితోషకం తీసుకుంటుందని తెలుస్తోంది ప్రస్తుతం సినిమాలలో కూడా రూ. 2 - 4 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న నేపథ్యంలో ఇలా ఒకవైపు సినిమాలు మరో ఒకవైపు ఇంస్టాగ్రామ్ ద్వారా భారీగానే సంపాదిస్తోంది సమంత.