లారెన్స్ సినిమాల క్రేజ్ అసలు తగ్గలేదుగా..?

Divya
హర్రర్ సినిమాలకు పెట్టింది పేరు హీరో రాఘవ లారెన్స్.. డైరెక్టర్ గా నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కాంచన , గంగ,  ముని వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు రాఘవ లారెన్స్. మొదట ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవి పక్కన ఒక గుంపులో గుర్తుపట్టలేని డ్యాన్సర్ గా తన కెరీర్ను మొదలుపెట్టారు. ఆ తర్వాత మెగాస్టార్ నటించిన హిట్లర్ సినిమాలో అదిరిపోయే స్టెప్పులతో స్టార్ మాస్టారుగా ఎదిగిపోయారు రాఘవ లారెన్స్. దర్శకుడిగా హీరోగా తెలుగు రాష్ట్రాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
ఇక నాగార్జునతో కలిసి మాస్ లాంటి పెద్ద సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తర్వాత డాన్ సినిమాని తెరకెక్కించగా పరవాలేదు అనుకున్నారు. ఇక ప్రభాస్ తో రెబల్ సినిమాను మాత్రం తెరకెక్కించి ఫ్లాప్ గా మిగిలేలా చేశారు.  అయినా కూడా రీ రిలీజ్ లో ఈ సినిమా బాగానే కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. దీంతో రాఘవ లారెన్స్ ను కొంతమంది హీరోలు పక్కన పెట్టేసారని వార్తలు వినిపించాయి.  దీంతో తన రూటుని మార్చేశారు. డైరెక్టర్ గా హర్రర్ సినిమాలకు షిఫ్ట్ అయ్యి ఒకే కథను అటు తిప్పి ఇటు తిప్పి మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు.
ఇక తాజాగా రాఘవ లారెన్స్ నటిస్తున్న రుద్రుడు అనే సినిమా వచ్చే నెల 14వ తేదీన విడుదల కాబోతోంది.  అయితే డైరెక్షన్ బాధ్యతలు తీసుకోలేదు కానీ కథ విషయంలో బాధ్యతలుbతీసుకున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్గా ప్రియ భవాని శంకర్ నటిస్తున్నది ఈ సినిమా కూడా దెయ్యం మూవీ కాన్సెప్ట్ తోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం డబ్బింగ్ వర్షన్ కు సంబంధించి ఏపీ , తెలంగాణ హక్కులకు మంచి క్రేజ్ ఏర్పడింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రైట్స్ను పూర్వీ పిక్చర్స్ వారు రూ.6.50 కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: