గోపీచంద్ వీరయ్యతో కాదు తమ్ముడితో..!

shami
ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో చిరు, వీర సిం హా రెడ్డితో బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడినా రెండు సినిమాలు ఆ హీరోల ఫ్యాన్స్ కు మంచి ఎంటర్టైన్ అందించడంలో సక్సెస్ అయ్యాయి. అందుకే ఆ సినిమాల దర్శకుల ఖాతాలో కూడా ఈ రెండు సినిమాలు హిట్లుగా నిలిచాయి. వీర సిం హా రెడ్డిని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా.. వాల్తేరు వీరయ్య సినిమాను బాబీ డైరెక్ట్ చేశారు. అంతకుముందు బాబీ ఎన్.టి.ఆర్, వెంకటేష్ లను డైరెక్ట్ చేసి స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. కానీ గోపీచంద్ రవితేజ దగ్గరే ఆగిపోయాడు.
కానీ క్రాక్ హిట్ పడటం ఆ వెంటనే బాలయ్య ఛాన్స్ ఇవ్వడంతో లెక్క మారింది. గోపీచంద్ స్టామినా ఏంటన్నది వీర సిం హా రెడ్డితో ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా విషయంలో గోపీచంద్ ని మెచ్చుకోక తప్పదు. బాలయ్య తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక వీర సిం హా రెడ్డి తర్వాత గోపీచంద్ మెగాస్టార్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడని టాక్. కానీ అసలు విషయం ఏంటంటే గోపీచంద్ చిరు కన్నా ముందు రవితేజతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ రవితేజతో గోపీచంద్ మలినేని ఇప్పటికే మూడు సినిమాలు చేశాడు.
డాన్ శీనుతో మొదలైన వీరి కాంబో మొదలై ఆ సినిమా హిట్ కొట్టి ఆ తర్వాత బలుపుతో మరో హిట్ అందుకున్నారు. ఇక క్రాక్ తో రవితేజ కి సెన్సేషనల్ హిట్ అందించాడు గోపీచంద్. అయితే ఈసారి మరింత భారీగా వీరి కాంబినేషన్ లో ఉంటుందని తెలుస్తుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ లోనే ఈ సినిమా నిర్మించబడుతుందని టాక్. మొత్తానికి క్రాక్ తర్వాత గోపీచంద్ మరోసారి రవితేజతో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. రవితేజ రావణాసుర సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. దానితో పాటుగా టైగర్ నాగేశ్వర్ రావు సెట్స్ మీద ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: