ఆ పాట పై మనసు పారేసుకున్న చిరంజీవి..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో నటించిన సినిమాలలో ఎన్నో బ్లాక్ బాస్టర్ పాటలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి కెరియర్ లోని కొన్ని పాత పాటలు ఇప్పటికీ కూడా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తున్నాయి. అలా ప్రేక్షకులను ఇప్పటికి కూడా అలరిస్తున్న చిరంజీవి సాంగ్ లలో ఒకటి రామ్మా చిలకమ్మా. ఈ పాట చూడాలని ఉంది సినిమా లోనిది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు.

ఈ పాట సినిమా విడుదల అయిన టైమ్ లో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పటికి కూడా ఈ సాంగ్ యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ వ్యూస్ ను సాధిస్తోంది. ఇలా ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సాంగ్ ను చిరంజీవి మరోసారి తన సినిమాలో రీమిక్ చేసి పెట్టుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ... మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కీర్తి సురేష్ ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తూ ఉండగా ... మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాలో శ్రీ ముఖి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ లలో ఒకటి అయినటు వంటి రామా చిలకమ్మా సాంగ్ ను రీమిక్ చేసి పెట్టాలి అనే ఉద్దేశం లో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలు స్తుంది. ఈ మూవీ కి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ విజయం అందుకున్నటు వంటి వేదాలం అనే మూవీ కి అధికారికంగా రీమేక్ గా రూపొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: