చేతులు కలుపుతున్న అల్లు అర్జున్, అక్షయ్ కుమార్..!

shami
అల్లు అర్జున్ పుష్ప తో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతనితో చేతులు కలిపేందుకు బాలీవుడ్ స్టార్ కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది. పుష్ప 2 సెట్స్ మీద ఉండగా ఈ సినిమాలో నటించేందుకు చాలామంది స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటించే ఛాన్స్ ఉందని టాక్. ఈమధ్య అక్షయ్ కుమార్ సినిమాలు బాలీవుడ్ లో ఘోరంగా విఫలమవుతున్నాయి. రీసెంట్ గా ఆయన సెల్ఫీ సినిమా అయినా డిజాస్టర్ కా బాప్ అనిపించేలా చేసింది. ఒకప్పుడు ఆయన సినిమాలు సూపర్ డూపర్ హిట్లు కాగా ఇప్పుడు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు.
ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం అక్షయ్ కుమార్ అల్లు అర్జున్ పుష్ప 2లో నటిస్తున్నాడని తెలుస్తుంది. అక్షయ్ కుమార్ అల్లు అర్జున్ ఈ కాంబో కుదురితే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు. అయితే అక్షయ్ కుమార్ పుష్ప 2లో నటిస్తాడన్న విషయాన్ని చిత్రయూనిట్ కన్ ఫర్మ్ చేయలేదు. పుష్ప 2 సినిమాలో ఇప్పటికే ఫాహద్ ఫాజిల్ ఉన్నాడు. పుష్ప పార్ట్ 1లోనే అతను చివర్లో కనిపించి సర్ ప్రైజ్ చేశాడు. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ఉంటే అదరగొట్టేయడం పక్కా అని చెప్పొచ్చు.
పుష్ప 2 సినిమాను సుకుమార్ మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్ 1 ఊహించని విధంగా నార్త్ సైడ్ బ్లాక్ బస్టర్ కాగా పార్ట్ 2ని కూడా అక్కడ ఆడియన్స్ అంచనాలను అందుకునేలా వారికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే అక్కడ హీరోలని కూడా తీసుకోవాలన్న ఆలోచన వచ్చినట్టు టాక్. ఈమధ్య పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు. అలానే పుష్ప 2లో బాలీవుడ్ స్టార్ కనిపిస్తే దానికి మరింత హైప్ వచ్చే ఛాన్స్ ఉందని అలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది తెలియాల్సి ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: