అలిని సైడ్ చేస్తున్న పవన్.. అతనికి ఛాన్స్..!

shami
పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ కలిసి ఒక క్రేజీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో హిట్టైన వినోదయ సీతం సినిమాను తెలుగులో అఫీషియల్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు కూడా కర్త కర్మ క్రియ అన్నీ తానై నడిపిస్తున్నాడు త్రివిక్రం. ఈ సినిమాకు డైరెక్షన్ మాత్రం సముద్రఖని చేస్తున్నారు. తెలుగులో విలన్ గా సూపర్ ఫాం లో ఉన్న ఆయన డైరెక్టర్ గా మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నారు. వినోదయ సీతం తమిళ వర్షన్ ఆయన డైరెక్ట్ చేయడమే కాదు నటించారు కూడా. ఆయన చేసిన పాత్రనే తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు.
మా హీరో రీమేక్ లు చేయకపోతే బెటర్ అని అనుకుంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ వినోదయ సీతం రీమేక్ చేయడం నచ్చకపోయినా పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంచి ఈ రీమేక్ తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సాయి ధరం తేజ్ పాత్ర కూడా చాలా కీలకం కానుంది. మేనల్లుడి కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇచ్చేలా పవన్ ఇలా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో బ్రహ్మానందం రోల్ కూడా చాలా పెద్దదని తెలుస్తుంది. అసలైతే ఈ పాత్రకి అలిని తీసుకోవాల్సింది కానీ పొలిటికల్ గా పవన్ కి అలి దూరమయ్యాడు. వైసీపీ లో చేరిన అలి పవన్ మీడా కామెంట్స్ చేశాడు.
అందుకే అలి చేయాల్సిన పాత్రని అతన్ని సైడ్ చేసి బ్రహ్మానందంకి ఇచ్చారని తెలుస్తుంది. బ్రహ్మానందం ఈమధ్య ఎక్కువ సినిమాలకు సైన్ చేయడం లేదు అయితే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఆయన చేస్తున్న సినిమా ఇదే అని తెలుస్తుంది. ఈమధ్య సినిమాల్లో చిన్న కెమియో రోల్స్ తప్ప బ్రహ్మి ఫుల్ లెంగ్త్ కామెడీ చూసి చాలారోజులైంది. ఇక కృష్ణవంశీ తీస్తున్న రంగమార్తాండ సినిమాలో మాత్రం సీరియస్ రోల్ లో అలరించనున్నారు బ్రహ్మానందం. ఆ సినిమాలో బ్రహ్మానందం ఎమోషనల్ సీన్స్ తో ఏడిపించేస్తాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: