బాలయ్య పాటకు మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన మెగా కోడలు.. వీడియో వైరల్..!!

Anilkumar
నటసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదలై ఆడియన్స్ ను ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. తమన్ కంపోజ్ చేసిన 'సుగుణ సుందరి' అనే సాంగ్ యూట్యూబ్ లో పలు రికార్డులు సైతం క్రియేట్ చేసింది. ఈ పాటలో బాలయ్య శృతిహాసన్ మాస్ స్టెప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా చాలామంది నేటిజన్స్ ఈ పాటకు డ్యాన్సులు వేసి రీల్స్ చేశారు. 

తమదైన డాన్స్ మూమెంట్స్ తో రీ క్రియేట్ చేయగా.. ఇప్పుడు తాజాగా మెగా కోడలు, యాంకర్ అయిన మేఘన ఈ సాంగ్ కి తనదైన డాన్స్ స్టెప్స్ వేసి అలరించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మెగా కుటుంబానికి దూరపు బంధువైన కొణిదెల పవన్ తేజ్ తో యాంకర్ మేఘనకు కొద్ది రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. బుల్లితెరపై యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ మంచి పాపులాంటిని దక్కించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ లో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో సుగుణసుందరి అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ ఒక వీడియోని షేర్ చేసింది.

ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్స్ ని ఆకర్షిస్తుంది. ఈ వీడియోలో బాలయ్య సాంగ్ కి మేఘన తనదైన స్టెప్స్ తో అదరగొట్టింది. దీంతో సోషల్ మీడియాలో మేఘన లేటెస్ట్ డాన్స్ వీడియో వైరల్ గా మారుతుంది. ఇక కొనిదెల పవన్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన 'ఈ కథలో పాత్రలు కల్పితం' అనే సినిమాలో మేఘన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ తేజ్ తో మేఘనకు పరిచయం ఏర్పడగా.. అది కాస్త ఇప్పుడు పెళ్లి వరకు దారి తీసింది. ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట త్వరలోనే గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: