చమ్మక్ చంద్రతో ఎఫైర్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సత్య శ్రీ..!?

Anilkumar
గత పది సంవత్సరాలుగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో చాలామందికి జీవితాన్ని ఇచ్చింది. ఇక అలాంటి వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు. చమ్మక్ చంద్ర సాధారణంగా ఎక్కువగా ఫ్యామిలీ స్కిట్లు చేస్తాడు. దీంతోనే ఆయనకు భారీ క్రేజ్ వచ్చింది .ముఖ్యంగా చమ్మక్ చంద్ర భార్య బాధితులు కు సంబంధించిన వీడియోలను ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే చంద్ర టీం లో ఆయనతోపాటు నటించే సత్యసరికి కూడా అంతే క్రేజ్ లభించింది. మొదట్లో కొన్నాళ్లు చమ్మక్ చంద్ర లేడీ గెటప్ లు వేసి అలరించాడు .అనంతరం ఈమె చమ్మక్ చంద్ర స్కిట్లలో చేయడం మొదలు పెట్టింది. వీరిద్దరూ కలిసి ఎక్కువగా భార్యాభర్తల స్కిట్లు చేస్తారు. 

దీంతో నిజంగానే వీరిద్దరూ భార్యాభర్తలు అన్న పుకార్లు సైతం రావడం జరిగింది. అనంతరం కొంత కాలానికి చమ్మక్ చంద్ర జబర్దస్త్ విడిచి వెళ్లిపోయాడు. చమ్మక్ చంద్ర వెళ్ళిపోవడంతో సత్య శ్రీ కూడా వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి వెళ్లిపోవడంతో విరిద్దరి మధ్య ఏవో అఫైర్లు ఉన్నాయి అంటూ పిచ్చిపిచ్చి వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇలా వరుసగా వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉంది అంటూ వస్తున్న వార్తలు పై నేరుగా స్పందించింది సత్య శ్రీ .తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు .ఇక ఇంటర్వ్యూలో భాగంగా సత్య శ్రీ మాట్లాడుతూ.. కొన్ని సంచలన నిజాలను బయటపెట్టింది.. ఇక అసలు విషయం ఏంటంటే చమ్మక్ చంద్ర జబర్దస్త్ స్కిట్ల తర్వాత ఆయనతోపాటు శ్రీ సత్య కూడా ఇతర ఛానల్ కి వెళ్లిపోయింది.. అక్కడ కూడా వీరిద్దరూ కలిసి నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.. సక్సెస్ కాలేకపోయినప్పటికీ వీరిద్దరి నటన అందరికీ నచ్చింది..

దీంతో వీరిద్దరూ ఎక్కడ ఉన్నా కూడా వీరిది ఫేమస్ జంట అని నిరూపించుకున్నారు.. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు మీడియాలో వీరిద్దరికి సంబంధించిన రకరకాల వార్తలు వస్తూ ఉండడంతో సత్య శ్రీ తల్లిదండ్రులు తనను అనుమానించారని ఆమె వెల్లడించింది.. అనంతరం కొన్నాళ్ళకి సత్య శ్రీ తన తల్లిదండ్రులకు అసలు విషయం వివరించడంతో నిజ నిజాలు తన తల్లిదండ్రులకు కూడా తెలిసాయని చెప్పుకొచ్చింది.. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ చమ్మక్ చంద్ర నాకు గురువు లాంటి వారు అంటూ క్లారిటీ ఇచ్చింది.. తాను జబర్దస్త్ మానేయడానికి ప్రత్యేకంగా వ్యక్తిగత కారణాలు ఏమీ లేవు అంటూ చెప్పుకొచ్చింది.. సాధారణంగా గురువు ఎక్కడుంటే అక్కడే మనం కూడా పనిచేస్తాము అంటూ వివరించింది సత్యశ్రీ.. కానీ కొందరు మాత్రం పిచ్చి పిచ్చి వార్తలు వైరల్ చేస్తున్నారు కానీ వాటిని నేను ఏమాత్రం పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది సత్యశ్రీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: