సెల్ఫీ ప్లాప్.. పఠాన్ కి అడ్వాంటేజ్ అయ్యిందిగా?

Purushottham Vinay
పఠాన్ ఘన విజయం సాధించడంతో ఇక బాలీవుడ్ ఫేట్ మారిపోయింది అంటూ తెగ హడావిడి చేశారు.కానీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇంకా ఏమి మారలేదు. పఠాన్ సినిమా తర్వాత వచ్చిన రెండు పెద్ద సినిమాలు కూడా డిజాస్టర్ అవ్వడంతో మళ్ళీ బాలీవుడ్ పాత స్థితిలోకి వచ్చేసింది. పఠాన్ సినిమా తర్వాత కార్తీక్ ఆర్యన్ షెహజాదా సినిమాతో వచ్చారు. ఈ సినిమా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ అలవైకుంఠపురంలో సినిమాకు రీమేక్ గా బాలీవుడ్ లో తెరకెక్కింది. కానీ షెహజాదా అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇక తాజాగా అక్షయ్ కుమార్ సెల్ఫీ మూవీ కూడా రిలీజయింది. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ కలిసి నటించిన సెల్ఫీ మూవీ శుక్రవారం నాడు ఫిబ్రవరి 24న రిలీజయి చాలా దారుణంగా డిజాస్టర్ అయ్యింది.ఈ సినిమా కూడా మలయాళ సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ కి రీమేక్ కావడం విశేషం. కరోనా రావడంతో హోల్డ్ లో ఉన్న అక్షయ్ కుమార్ సినిమాలన్నీ కూడా ఇప్పుడు వరుసగా రిలీజయ్యాయి. స్టార్ హీరో అయినా ఒకే ఇయర్ లో ఏకంగా ఏకంగా 6 సినిమాలు రిలీజ్ చేశాడు.


కానీ ఈ ఆరు సినిమాలు ఫ్లాప్ . దీంతో అక్షయ్ సెల్ఫీ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఎలాంటి హైప్ లేదు. ఇక సినిమా రిలీజయ్యాక థియేటర్స్ లో జనాలు అస్సలు లేరు. ఏ స్టార్ హీరో సినిమాకైనా కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయి. కానీ సెల్ఫీ సినిమాకి మొదటి రోజు మొత్తంగా దారుణంగా 2.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇది ఈమధ్య వచ్చిన అక్షయ్ ఫ్లాప్ సినిమాల కంటే కూడా తక్కువ ఓపెనింగ్స్. టైర్ 2 హీరోలకు కూడా ఓపెనింగ్స్ ఇంతకంటే బాగా వస్తున్న సమయంలో అక్షయ్ లాంటి స్టార్ సినిమాకు ఇలా కలెక్షన్స్ రావడంతో బాలీవుడ్ ఎంతగానో ఆశ్చర్యపోయింది. ఇక అక్షయ్ అభిమానులు మరో ఫ్లాప్ పడినందుకు చాలా నిరాశ చెందుతున్నారు.అయితే సెల్ఫీ ప్లాప్ అవ్వడం పఠాన్ సినిమాకి కలిసి వచ్చింది. ఓవర్సీస్ లో సెల్ఫీని తీసేసారు.కానీ పఠాన్ కి ఫిఫ్త్ వీకెండ్ కూడా అడ్వాంటేజ్ అయ్యింది.ఫలితంగా పఠాన్ మళ్ళీ వసూళ్లు రాబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: