"ఎస్ఎస్ఎంబి 28" లో మహేష్ తాత పాత్రలో ఆ విలక్షణ నటుడు..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం బ్రహ్మోత్సవం మరియు స్పైడర్ మూవీ ల అపజయాలతో తన అభిమానులను తీవ్ర నిరుత్సాహ పరచాడు. అలా వరుసగా రెండు అపజయాలతో అభిమానులను తీవ్ర నిరుత్సాహ పరిచిన మహేష్ ఆ తర్వాత భరత్ అనే నేను ... మహర్షి ... సరిలేరు నీకెవ్వరు ... తాజాగా సర్కారు వారి పాట లాంటి వరుస విజయాలతో తన అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరిస్తూ వస్తున్నాడు.

ఇలా ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ ప్రస్తుతం సూర్య దేవర నాగ వంశీ నిర్మాణం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ కి ఈ సినిమా బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ను ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన అందాల ముద్దు గుమ్మలు పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు. తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మహేష్ కు ఒక తాత పాత్ర ఉంటుందట. ఈ పాత్ర మూవీ కి హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఇలా ఈ మూవీ కే హైలెట్ గా నిలిచే తాత పాత్రలో ఈ సినిమాలో ప్రకాష్ రాజు కనిపించబోతున్నట్లు ... మరి కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువబడబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే మహేష్ మరియు ప్రకాష్ రాజ్ కాంబినేషన్.లో ఎన్నో మూవీ లు తెరకెక్కయి.  వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చాలా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: