"మగధీర" రీ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా రామ్ చరణ్ కెరియర్ లో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాలలో ఒకటి మగధీర. ఈ మూవీ కి అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులను ఒకరు అయినటు వంటి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో అందాల ముద్దు గుమ్మ కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించాడు. ఈ మూవీ భారీ అంచనాలు నడుమ 2009 వ సంవత్సరం జూలై 31 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్ లు వచ్చాయి. దానితో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించాడు. కీరవాణి అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది. 

అలా 2009 వ సంవత్సరం విడుదల అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాను మళ్ళీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 25 మరియు  26 తేదీలలో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫోర్ కే వర్షన్ తో థియేటర్ లలో ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఆ సమయంలో అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మగధీర సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ రికార్డ్ లను సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: