కొత్త యాడ్ తో అదరగొట్టేస్తున్న మహేష్ బాబు..!!

Divya
ఎంతోమంది సినీ తారలు పలు రకాల వస్తువులకు, పలు రకాల యాడ్స్లలో నటించడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇక టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని భాషలలో ఉన్న సెలబ్రిటీలు సైతం ఈ యాడ్లలో కనిపిస్తూ ఉంటారు. ఇండియాలో అయితే ఎక్కువగా కూల్ డ్రింక్స్, బైక్స్ వంటి వాటికి ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. గత కొంతకాలంగా భారత్ లో కూల్డ్రింక్ వంటి వాటికీ హీరోలు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలా టాలీవుడ్లో సూపర్ స్టార్ గా మహేష్ బాబు గతంలో తంసప్ కూల్ డ్రింకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.

ప్రస్తుతం మహేష్ మౌంటెన్ డ్యూకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. మౌంటెన్ డ్యూకి సంబంధించి ఒక యాడ్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. సినిమా యాక్షన్ సీనుకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ యాడ్ ఉందని చెప్పవచ్చు. మహేష్ యాక్టింగ్ ఇరగదీసేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు తన అధికారికంగా యూట్యూబ్ ఖాతాలో ఈ వీడియోని షేర్ చేయడం జరిగింది. షేర్ చేసిన నాలుగు గంటలలోనే 25 వేలకు పైగా వ్యూస్ వందల సంఖ్యలో కామెంట్లతో ఈ వీడియో మరింత పాపులర్ అవుతొంది.

మహేష్ బాబు టాలీవుడ్ లో జేమ్స్ బాండ్ల ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉన్నాయి.మహేష్ చెప్పిన డైలాగులు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మహేష్ బాబు ,త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా లో నటించబోతున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమానీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ కు సంబంధించి ఒక వీడియో మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: