నానికి వినూత్నంగా బర్త్డే విషెస్ చెప్పిన కీర్తి సురేష్...!!

murali krishna
నాచురల్ స్టార్ నాని 39వ పుట్టినరోజును ఇవాళ జరుపుకున్నాడు. అంతకు ముందే దసరా చిత్రం యూనిట్ నాని పుట్టినరోజును పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని 39 సినిమా థియేటర్లలో వినూత్నంగా దసరా సినిమా లో నాని ఇంట్రడక్షన్ ను ప్రదర్శించింది.
అక్కడికి వచ్చిన అభిమానుల తో హ్యాపీ బర్త్డే టూ యు నాని అని చెప్పించి ఆ వీడియోల ను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. ఇక సినిమా పరిశ్రమకు సంబంధించిన చాలామంది నానికి శుభాకాంక్షలు చెప్పారు.నాని భార్య అంజన సౌమ్య ' 15 సంవత్సరాలుగా నువ్వు నాకు తెలుసు.. నీతో ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను' అంటూ ఎమోషనల్ పోస్ట్ ను పెట్టింది.
నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం లో కీర్తి సురేష్ భిన్నంగా ఆలోచించింది.. నానితో దసరా సినిమా షూటింగ్ స్పాట్లో షటిల్ ఆడుతున్న వీడియోను తాను పోస్ట్ చేసింది. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగా అయితే షటిల్ ఆడారు. పని ఒత్తిడి నుంచి వారు ఉపశమనం పొందారు. ఇదే సమయంలో నాని ఏదో అంటే కీర్తి సురేష్ చిలిపిగా షటిల్ బ్యాట్ తో కొట్టిందట... అంతే కాదు నాని కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోను, దసరా సినిమాలో నాని గెటప్ కు సంబంధించి న ఫోటోలను సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది.. కుమ్మేసెయ్ ధరణి అంటూ కూడా రాసుకొచ్చింది.
ఇక నానికి కీర్తి సురేష్ వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ' ప్రియమైన స్నేహితుడా నీతో నా అనుబంధం ప్రత్యేకం. నీతో సినిమా గురించి అన్ని విషయాలు నేను చర్చిస్తాను.. అది నాకు ఎంతో సంతోషాన్ని అయితే కలిగిస్తుంది.. హ్యాపీ బర్త్డే టూ యు నాని అంటూ' ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ కు స్పందించిన నెటిజన్లు 'ఒక స్నేహితుడికి మరొక స్నేహితురాలు ఇంత కంటే గొప్పగా శుభాకాంక్షలు చెబుతుందా' అని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: