Hyderabad: ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ కు అంతా రెడీ?

Purushottham Vinay
ఇక మ్యాస్ట్రో ఇళయరాజా  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది ప్రేక్షకులను తన పాటలతో కట్టిపడేసిన సంగీత విధ్వంసుడు. చాలా సినిమాలు కేవలం ఈయన పాటల వల్లే హిట్ అయ్యాయి. చాలా సినిమాలని తన సంగీతంతో డామినేట్ చేసిన సంగీత దర్శకుడు ఇళయరాజా.ఇక చాలా కాలం తర్వాత మళ్లీ హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్నారు.ఇక ఈ సంగీత దిగ్గజాన్ని సత్కరించేందుకు హైదరాబాద్ టాకీస్ ఇంకా మెర్క్యూరీ సంస్థలు అద్భుతమైన మ్యూజిక్ ఈవెంట్ ను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. 5  తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్న ఇళయరాజాను చాలా ఘనంగా సత్కరించేందుకు సినీ తారలు ఇంకా పలు రాజకీయ వేత్తలను కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆహ్వానించారు.ఈనెల ఫిబ్రవరి 25, 26 తేదీల్లో అనగా రేపు ఎల్లుండి గచ్చిబౌళి స్టేడియంలో సాయంత్రం 6.30 నిమిషాలకు ఈ లైవ్ కాన్సర్ట్ అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 26 వ తేదీన ఈ వేడుకకు ఇళయరాజా హాజరుకానున్నారు.


ఇంకా అంతేకాకుండా సంగీత ప్రియుల కోసం తానే స్వయంగా స్టేజీపై లైవ్ పెర్ఫామెన్స్ కూడా ఇవ్వబోతుండటం గొప్ప విశేషం. ఈ సందర్భంగా సంగీతప్రియులు ఇంకా ఇళయరాజా అభిమానులు ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సూపర్ కాన్సర్ట్ కు హాజరు కావాలని చాలా మంది అతిథులను కూడా ఆహ్వానించారు నిర్వాహకులు.తెలంగాణ ఐటీ శాఖ మంత్రి అయిన కల్వకుంట్ల తారక రామారావు ఇంకా సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ ను ఆహ్వానించారు. ఈ వేడుకకు హాజరై ఈ సంగీత దిగ్గజాన్ని సత్కరించాలని కూడా అభ్యర్థించారు. ఇంకా అలాగే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి , కింగ్ అక్కినేని నాగార్జుననూ కూడా ఆహ్వానించారు. ఈ కచేరీలో చాలా మంది ప్రముఖులతో కలిసి మంత్రి కేటీఆర్ ఇళయరాజాను సత్కరించబోతున్నారు. ఇళయరాజా రాకాపై చిరంజీవి ఇంకా నాగార్జున చాలా సంతోషం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: