ఆ మాస్ డైరెక్టర్ కు మరో అవకాశం ఇవ్వబోతున్న చిరంజీవి...!!

murali krishna
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తుండటం తో చాలా మంది డైరెక్టర్లకు ఆఫర్స్ వస్తున్నాయి.చిరు ఆ మాస్ డైరెక్టర్ కు ఓకే చెప్పారు అనే వార్తలు నెట్టింట తరచుగా మనము వింటూనే ఉంటున్నాం..
మరి తాజాగా మెగాస్టార్ మరో మాస్ డైరెక్టర్ కు ఓకే చెప్పినట్టు టాక్ కూడా నడుస్తుంది.. ఆయన ఇంకెవరో కాదు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ అయిన వివి వినాయక్ అని తెలుస్తుంది.
చిరంజీవితో వివి వినాయక్ కు మంచి హిట్ ట్రాక్ అయితే ఉంది.. వినాయక్ కు మాస్ సినిమాలలో మంచి  పేరు ఉన్న విషయం తెలిసిందే .. మరి ఈ కాంబోలో  మరో సినిమా కూడా ఉండవచ్చని ఇప్పుడు రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.. మరి ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది.. ఇక ఈ కాంబోలో డైరెక్ట్ కథ తో వస్తుందో లేదంటే రీమేక్ కోసం చిరు అవకాశం ఇస్తారో చూడాలి..
ఇదిలా ఉండగా ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చాడు..ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే భారీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాను విడుదల చేసేందుకు మెగాస్టార్ సన్నాహాలు కూడా చేస్తున్నాడు.. మరి వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'భోళా శంకర్'. ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరు కు చెల్లెలుగా నటిస్తుందని తెలుస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడట.. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉన్న చిరు తరువాత సినిమా ఎవరితో చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: