ఆస్కార్ కోసం RRR అదిరిపోయే ప్లాన్ ?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్.రాజమౌళి రీసెంట్ గా తెరకెక్కించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్  హీరోలుగా నటించారు.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దాదాపుగా రూ.1200కోట్లకు పైగా వసూళ్లను ఈ సినిమా రాబట్టింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాను 1920ల బ్యాక్‌డ్రాప్‌లో ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కించారు. అల్లూరి సీతారామరాజు ఇంకా కొమరం భీమ్‌ల స్ఫూర్తితో రూపొందించారు. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, సముద్ర ఖని, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాకు గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఫిదా అయిపోయారు.దాని ఫలితంగా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో 'ఆర్ఆర్ఆర్' సినిమా సత్తా చాటింది. ఈ సినిమా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కూడా కైవసం చేసుకుంది. ఇంకా అంతేగాక ఆస్కార్ బరిలోను నిలిచింది. 'నాటు నాటు' సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అకాడమీ అవార్డ్ కోసం ఇప్పుడు పోటీపడుతుంది.ఆస్కార్ అవార్డ్స్‌ను మార్చి 12 వ తేదీన ప్రదానం చేయనున్నారు.

అందువల్ల 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఒక హీరో అయిన రామ్ చరణ్ పాపులర్ షో 'గుడ్ మార్నింగ్ అమెరికా' లో పాల్గొన్నారు.ఇంకా కొన్ని ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాగే మేకర్స్ కొత్త ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఇంకా అలాగే అమెరికాలోని థియేటర్స్‌లో సినిమాను రి రిలీజ్ చేయనున్నారు. మొత్తం 200 థియేటర్స్‌లో సినిమాని ప్రదర్శించనున్నట్టు చెప్పారు. మార్చి 3 వ తేదీ నుంచి మూవీ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్. కీరవాణి కూడా ప్రమోషన్స్‌లో అతి త్వరలోనే చేరుతారని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. మీట్ అండ్ గ్రీట్‌ షోస్‌లో మూవీ టీం అభిమానులతో కూడా ముచ్చటించనున్నట్టు సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: