మరోసారి ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన అనుష్క.. అందుకే బరువు పెరిగిందా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి సూపర్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అనుష్క. తొలి సినిమాతోనే హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని ఆ తర్వాత అరుంధతి సినిమాతో తన నటన ఏంటో చూపించింది అనుష్క. దాని అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. దాని అనంతరం ముఖ్యపాత్రులు కలిగిన సినిమాలలో మాత్రమే నటించడం మొదలు పెట్టింది. అలా హీరోయిన్ గా ఆమె నటించిన రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి సినిమాలు ఇందుట్టి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఇక అలా హీరోయిన్గా రాణిస్తున్న అనుష్క కోలీవుడ్ కి రెండు సినిమాలతో పరిచయమైంది. ఆ సినిమాల్లో కూడా తన నటనతో అందరిని ఆకట్టుకుంది అనుష్క. దానియనంతరం దైవ తిరుమల, సింగం వంటి హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇక అలాంటి ఒక స్టార్ హీరోయిన్ ఇప్పుడు బరువు పెరిగి ఎవరో గుర్తుపట్టకుండా అయిపోయింది అనుష్క. ఇంజి ఇడుప్పలగి అనే సినిమాలో తన పాత్ర కోసం బరువు పెరిగింది.. సినిమా తర్వాత బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.. దాంతో నటనకు పూర్తిగా దూరమైంది అనుష్క. ఆ మధ్యకాలంలో అనుష్క నవీన్ పోలిశెట్టితో కలిసి ఒక సినిమా చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.

ఆ వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. అయితే తాజాగా మరోసారి అనుష్క మరింత లావెక్కిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .ఈ క్రమంలోనే అనుష్క మళ్ళీ కోలీవుడ్లో రియల్ కి సిద్ధమైందని అంటున్నారు. దర్శకుడు ఏ ఎల్ విజయ దర్శకత్వంలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో అనుష్క దర్శకత్వంలో దైవత్తి రుమగల్ సినిమాలో నటించింది. దీంతో మరొకసారి ఈయన దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: