మన స్టార్స్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్స్ ఇవే?

Purushottham Vinay
ఒక్కోసారి మన స్టార్స్ మిస్ చేసుకున్న సినిమాలు ఊహించని రేంజిలో బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి. అలా మన స్టార్ హీరోలు మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా సూపర్ స్టార్ మహేష్ విషయానికి వస్తే ప్రస్తుతం వరుస హిట్లతో టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్స్ మూవీస్ విషయానికి వస్తే.. వర్షం, మనసంతా నువ్వే, ఫిదా, ఏమాయ చేసావే వంటి సినిమాలు మహేష్ తన స్టార్ డమ్ కి సెట్ కావని వదులుకున్నాడు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సింహాద్రి లాంటి మాస్ బ్లాక్ బస్టర్ ని మిస్ చేసుకోవడం జరిగింది. ఇక జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతడు, పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్స్ మిస్ చేసుకొని రీమేక్ సినిమాలపై దృష్టి పెట్టాడు. మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్య, బొమ్మరిల్లు, ఊపిరి లాంటి సినిమాలు తన మాస్ ఇమేజ్ కి సెట్ కావని వదులుకున్నాడు.


ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే.. భద్ర, గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని వదులుకున్నాడు.అయితే వీటిలో చాలా మూవీస్ కూడా వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టు లేవు. కానీ పవన్ కళ్యాణ్, ప్రభాస్ మాత్రం వల్ల ఇమేజ్ కి సూట్ అయ్యే సింహాద్రి, పోకిరి, అతడు లాంటి సినిమాలను మిస్ చేసుకున్నారు.కానీ బ్లాక్ బస్టర్స్ ని మిస్ చేసుకున్నా ఇప్పుడు ఈ హీరోలు అందరూ కూడా టాలీవుడ్ టాప్ హీరోలుగా హైయెస్ట్ ఫ్యాన్ బేస్ తో విపరీతమైన క్రేజ్ తో దూసుకుపోతున్నారు.ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఈ స్టార్స్ అందరూ బిజీగా ఉన్నారు.మహేష్ SSMB 28, 29, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, OG, ప్రభాస్ ఆదిపురుష్, సలార్, project K, ఎన్టీఆర్ ntr 30,31, బన్నీ పుష్ప ది రూల్, రామ్ చరణ్ RC 15 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: