ఇకపై అలా చెయ్యకంటూ చిరంజీవి కి వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్..!?

Anilkumar
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.గతేడాది విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలనాలను సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ విడుదలైంది. అన్ని భాషల్లో కూడా భారీ వసూళ్లను  రాబట్టింది ఈ సినిమా. ప్రస్తుతం నాటు నాటు  పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్బరిలో నిలవడం జరిగింది. 

ఇక ఈ నేపథ్యంలోనే హాలీవుడ్ దర్శకజం జేమ్స్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ పోషించిన సీతారామరాజు పాత్ర ఆయనకు ఎంతగానో నచ్చిందని తెలియజేశారు. ఇక దానికి సంబంధించిన ఒక వీడియోను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. జేమ్స్ కెమెరూన్ లాంటి దర్శకుడు రామ్ చరణ్ పాత్ర గురించి మాట్లాడడంతో పుత్రోత్సాహంతో పొంగిపోయారు చిరంజీవి. ఆ పోస్ట్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ జేమ్స్ కెమెరా లాంటి దర్శకుడికి రాం పాత్ర బాగా నచ్చింది అంటే అది ఆస్కార్ అవార్డుకు ఏమాత్రం తక్కువ కాదు. చరణ్ కి దక్కిన గొప్ప గౌరవం ఇదే..

చరణ్ ని ఇలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అంటూ తన పోస్టులో భాగంగా పేర్కొన్నాడు చిరంజీవి. అయితే ఇదే ఇప్పుడు వివాదానికి దారితీసింది  అని అంటున్నారు. త్రిబుల్ ఆర్ సినిమాలు రామ్ చరణ్ మాత్రమే కాదు జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా అద్భుతంగా నటించాడు. అసలు జూనియర్ ఎన్టీఆర్ లేకుంటే చరణ్ పాత్రకు అర్థం లేదు అంటూ చాలామంది అంటున్నారు. అంతేకాదు ఎంతో కష్టపడి ఈ సినిమాను రాజమౌళి తీశాడు. కానీ చిరంజీవి మాత్రం తన కొడుకు గురించి మాత్రమే చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ రాజమౌళి గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడంతో వారి అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో చరణ్ చిరంజీవిపై కోప్పడినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇంకోసారి ఇలాంటి పోస్ట్లు పెట్టొద్దని చిరంజీవికి రామ్ చరణ్ వార్నింగ్ కూడా ఇచ్చారని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: