వరుణ్ మీద అలా ప్రేమ చూపిస్తున్న హీరోయిన్..!

shami
హీరో హీరోయిన్ కలిసి ఒక సినిమాలో నటిస్తే చాలు వారి మధ్య ఏదో ఉందని వార్తలు రాసేస్తారు. అయితే వారి కాంబో హిట్ అయినా కాకపోయినా సరే వారిపై అలాంటి వార్తలు వస్తాయి. లేటెస్ట్ గా మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ల గురించి కూడా రకరకాల వార్తలు వచ్చాయి. వీటిపై డైరెక్ట్ గా ఎవరు రియాక్ట్ కాకపోయినా వారి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న టాక్ అయితే ఉంది. అయితే వరుణ్, లావణ్య ఇద్దరు కలిసి మిస్టర్ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి నటించింది లేదు.
మరి అప్పటి నుంచి వీరి మధ్య రిలేషన్ ఉందా లేదా అన్నది తెలియదు కానీ వరుణ్ అంటే ఎప్పటికప్పుడు తన ప్రేమని చూపిస్తూ వస్తుంది లావణ్య త్రిపాఠి. లేటెస్ట్ గా తను నటించిన పులి మేక వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో కూడా వరుణ్ తేజ్ గురించి ప్రస్తావించి అందరికి షాక్ ఇచ్చింది అమ్మడు. పులి మేక ప్రమోషన్స్ లో భాగంగా సుమ అడ్డా షోలో పాల్గొన్నారు టీం. అయితే ఈ షోలో లావణ్యని ఒక ప్రశ్న అడిగింది సుమ. నాని, వరుణ్ లలో ఎవరు రొమాంటిక్ హీరో అని అడిగింది. దానికి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పేరు చెప్పింది.
ఆమె తన అభిప్రాయాన్ని చెప్పినా స్పెసిఫిక్ గా వరుణ్ తేజ్ పేరు చెప్పడం మాత్రం అందరికి షాక్ ఇచ్చింది. వరుణ్ తేజ్ అంటే తనకు ఇష్టం అని ఆమె ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. అయితే వరుణ్ తేజ్ మాత్రం ఆమెను లైట్ తీసుకున్నాడు. ఆమధ్య వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అంటూ కూడా వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం అన్నది తెలియదు కానీ వరుణ్ తేజ్ పై తన ప్రేమని తెలియచేస్తూ లావణ్య మాత్రం అందరికి హింట్ ఇచ్చేస్తుంది. మరి నిజంగానే ఆ హీరోయిన్ ఈ హీరో ప్రేమలో ఉన్నారా పెళ్లి చేసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: