కాంతారా సిక్వెల్ లో నటించబోతున్న సూపర్ స్టార్...?

murali krishna
ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా సినిమా రూ .16 కోట్ల రూపాయలతో తెరకెక్కించ బడింది.విడుదలైన ఈ చిత్రం దాదాపుగా రూ.400 కోట్ల రూపాయల భారీ వసూళ్లను రాబట్టింది. ఇక కాంతార(Kantara) తో ఏర్పడిన క్రేజ్ తో కాంతారా-2 సినిమా నీ  అనౌన్స్మెంట్ కూడా  చేశారు డైరెక్టర్. అయితే కాంతారా ప్రీక్వెల్ వస్తుందని టాక్ బాగా వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నటించబోతు న్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 
రిషబ్ శెట్టి కాంతారా-2 చిత్రాన్ని కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి కూడా అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెలకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.ఒకవేళ రజినీకాంత్ ఈ సినిమాలో ఉంటే  సినిమా మరొక లెవల్లో ఉంటుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కాంతారా-2 సినిమా మరిన్ని సర్ప్రైజులు ఉంటాయన్నట్లు గా కూడా శాండిల్ వుడ్ నుంచి సమాచారం..ఈ సినిమా కథ ఇప్పటికే సిద్ధమైనట్లుగా కూడా సమాచారం..క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో హీరో డైరెక్టర్ రిశాబ్ శెట్టి ఉన్నట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుతం రజనీ కాంత్ అయితే జైలర్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. రజనీకాంత్ విజయం అందుకోక కొన్ని సంవత్సరాలు పైనే అయితే అవుతోంది .భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తు సక్సెస్ కాలేకపోతున్నారట రజనీకాంత్. మరి జైలర్ సినిమాతో నైనా ఈసారి అభిమాను లను ఆక ట్టుకుంటారేమో చూడాలి.. నిజానికి జైలర్ సినిమా లో ఎన్నడూ చూడని విధంగా సినీ ఇండస్ట్రీలో మొదటిసారి అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించబోతున్నారట.. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకం అయితే అభిమానులలో కలుగుతుంది. ఇదిలా ఉండగా మరొకవైపు కాంతారా-2 చిత్రంలో రజనీకాంత్ నటిస్తారా లేదా అనే విషయం పై దర్శకుడు క్లారిటీ ఇవ్వాల్సిందే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: