ఆర్య సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరంటే?

Purushottham Vinay
స్టైలిష్ స్టార్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాల్లో అన్నిటికంటే ముఖ్యంగా ఆర్య సినిమా గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. జూలాయి సినిమా రాకముందు దాకా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందుకున్న భారీ హిట్ సినిమా ఆర్యనే కావడం విశేషం.ఈ మూవీలో కథతో పాటు బన్నీ యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ ఇంకా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి ఒక రేంజికి తీసుకెళ్లాయి.అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీలో శివబాలాజీ కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ రేంజ్ పూర్తిగా మారిపోయింది. సుకుమార్ తో కలిసి ఆ తర్వాత ఆర్య 2 సినిమా కూడా చేశాడు. ఆ సినిమా యావరేజ్ గా నిలిచిన ఆడియో చార్ట్ బస్టర్ అయ్యి ఫైనల్ గా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.


అలాగే రీసెంట్ గా పుష్ప సినిమా చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఏకంగా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆర్య లో మాత్రం ముందుగా అల్లు అర్జున్ ను హీరోగా అనుకోలేదట.అయితే ఆర్య సినిమాని ముందుగా నితిన్ తో చేద్దాం అనుకున్నారట . నితిన్ దిల్ తో సాలిడ్ సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. వివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.అయితే దిల్ సినిమా తర్వాత ఆర్య చేద్దాం అనుకుంటే అప్పటికే నితిన్ కి అరడజన్ కు పైగా సినిమాలు వున్నాయట. దాంతో డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక నితిన్ ఈ నుంచి తప్పుకున్నాడట . దాంతో అల్లు అర్జున్ తో సుకుమార్ ఈ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: