కీరవాణిని భయపెట్టించిన సినిమా ఏంటో తెలుసా..?

Divya
ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గోల్డెన్ గ్లోబ్ అందుకుని మరింత పాపులారిటీ దక్కించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. అలాంటి కీరవాణిని సైతం ఒక సినిమా భయపెట్టిందంటే ఎవరైనా నమ్మగలరా.. ఆ సినిమా పేరు చెబితే చాలు ఆయనకు రాత్రిపూట పీడకలలు వచ్చేవట. ఆ సినిమా అంతలా ఎంఎం కీరవాణిని భయపెట్టిందని సమాచారం. ఇకపోతే ఆ సినిమా ఏమిటి? ఎవరు ఆ సినిమాను తీశారు అనే విషయం ఇప్పుడు ఒకసారి చూద్దాం..
క్షణం క్షణం వంటి అద్భుతమైన సినిమాకు రామ్ గోపాల్ వర్మ కోసం పనిచేసిన కీరవాణి రాంగోపాల్ వర్మ తీసిన రాత్రి అనే సినిమా కోసం కూడా ఆర్ఆర్ వేయాలని కీరవాణికి కబురు పెట్టారట వర్మ. ఆ సమయంలో వర్మ టాలీవుడ్ లో నెంబర్ వన్ డైరెక్టర్ పొజిషన్ కి చేరుకున్నారు . అందుకే రాత్రి సినిమా పూర్తి చేయగలిగినట్లు తెలుస్తోంది.. షూటింగ్ కూడా మొత్తం అయిపోయింది నగరాతో కూడిన శబ్దాలతో డబుల్ పాజిటివ్ రెడీ అయిన సినిమాలు చూడమని సంగీత దర్శకుడైన కీరవాణిని మద్రాస్ నుంచి పిలిపించారు వర్మ.  ఆ సినిమా మొత్తం చూశాక ఆయనకు అక్కడ నుంచి పారిపోయినంత పని అయ్యిందట. అప్పటినుంచి వర్మకు కానీ ఆయన అసిస్టెంట్ శివ నాగేశ్వరరావుకు అని కీరవాణి కనిపించకుండా తిరగడం మొదలు పెట్టారని సమాచారం.
అసలు విషయం ఏంటో కూడా చెప్పకుండానే కీరవాణి రెస్పాండ్ అవ్వడం కూడా మానేశారట ఒకరోజు శివ నాగేశ్వరరావు కీరవాణిని పట్టుకొని తప్పకుండా టైం ఇవ్వాల్సిందే అని అడగడంతో అసలు విషయం చెప్పకుండా దయచేసి నన్ను వదిలేయండి అంటూ దండం పెట్టారట కీరవాణి. దాంతో శివనాగేశ్వరరావు అసలు విషయం వర్మతో చెప్పగా వర్మ కూడా హర్ట్ అయ్యాడట దాంతో రాత్రి సినిమాతో పాటు అప్పటికే తీసి పెట్టుకున్న మనీ అనే కామెడీ సినిమాకి కూడా కీరవాణిని తప్పిస్తున్నట్టు కోపంగా చెప్పారట వర్మ. దాంతో కొండాల తర్వాత శివనాగేశ్వరరావు ఏమైందని గట్టిగా నిలదీయగా రాత్రి సినిమాలో నగరా సౌండ్ లో చూసిన తర్వాత తనకు ప్రతిరోజు పీడకలలు వచ్చేవని.. అందుకే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేస్తే ఆ ప్రభావం తనపై ఇంకా పడి పిరికివాడిగా మారిపోతానని అందుకే చేయలేదు అంటూ తెలిపారట కీరవాణి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: