రేణు దేశాయ్ కోసం అలాంటి గొప్పపని చేయబోతున్న పవన్ కళ్యాణ్..!?

Anilkumar
టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకవైపు సినిమాలో మరోవైపు రాజకీయాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ .చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అన్నకి సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు. ఆయన వ్యక్తిత్వానికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు .ఆయన సినిమాలో పెద్దగా హిట్ అవ్వకపోయినప్పటికీ కలెక్షన్లు మాత్రం భారి స్థాయిలో వస్తాయి. హిట్ సినిమాకి రావాల్సిన స్థాయిలో పవన్ సినిమాలు వసూళ్లను రాబడతాయి. కెరియర్ పరంగా  ఎలాంటిదోకాలేని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.

 రాజకీయాల విషయంలో అనేక విమర్శలను కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ చాలామంది పవన్ కళ్యాణ్ పై విమర్శలను కురిపిస్తూ ఉంటారు .ఇక వాళ్లందరినోళ్లను ఎప్పటికప్పుడు ముగిస్తాడు పవన్ కళ్యాణ్.ఈ క్రమంలోనే ముఖ్యంగా రేణు దేశాయ్ తో పిల్లల్ని కని రెండు దేశాయికి మరియు పిల్లలకి ఘోరమైన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ చేశాడు అంటూ ఎప్పటికప్పుడు విమర్శలను చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడాకులు ఇచ్చిన తరువాత ఆమెకి ఎలాంటి

 ఆస్తి మరియు డబ్బులని పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు అంటూ చాలామంది వాపోయారు. ఇక అలాంటి వాళ్ళ నోర్లు ముగించేందుకు త్వరలోనే రేణు దేశాయ్ పేరిట 100 కోట్ల ఆస్తిని రాసిచ్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అంతేకాదు ఆస్తి తన పిల్లలకు ఉపయోగపడే విధంగా వీలునామాను పవన్ కళ్యాణ్ రాసి ఇవ్వడానికి సిద్ధమయ్యాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఈ పని చేసేందుకు సిద్ధమైన అందుకు చాలామంది పవన్ కళ్యాణ్ ను అభినందిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకు ఆస్కారం ఉండదు అంటూ పవన్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: