సార్ : రివ్యూ

shami
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సార్. తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజైంది. సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దం.

కథ :
1998-2000 నేపథ్యంతో సాగే కథ సార్. త్రిపాఠి కాలేజ్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ తో వాటి అధినేత సముద్రఖని రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశ పెట్టడంతో ప్రభుత్వ విద్యా సంస్థలను దత్తత తీసుకుని తన కాలేజీలోని లెక్చరర్స్ ని ప్రభుత్వ కాలేజీలకు పంపిస్తాడు. వారిలో బాల గంగాధర్ తిలక్ అలియాస్ బాలు (ధనుష్) సిరిపురం జూనియర్ కాలేజ్ కి లెక్చరర్ గా వెళ్తాడు. అక్కడ కుల వివక్ష.. చదువుకోవాల్సిన విద్యార్ధులకు సరైన పాఠాలు చెప్పని లెక్చరర్స్ ని చూసి బాలు వారిని మార్చాలని అనుకుంటాడు. విద్యార్ధులను కాలేజీకి వచ్చేలా మోటివేట్ చేస్తాడు బాలు. బాలు వల్ల అక్కడ మంచి రిజల్ట్ వస్తుంది. అయితే త్రిపాఠికి ఇది తెలిసి బాలుని అడ్డుకోవాలని చూస్తాడు. బాలుని ఇబ్బందులు పెడతాడు. ఇంతకీ త్రిపాఠి బాలుని ఎలా ఇబ్బంది పెట్టాడు..? బాలు తన సమస్యల నుంచి ఎలా బయట పడ్డాడు అన్నది మిగతా సినిమా కథ.
విశ్లేషణ :
సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగగా సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా ఉంటుంది. ధనుష్ పాత్ర హైలెట్ గా నిలుస్తుంది. కొన్ని సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. హీరోయిన్ తో లవ్.. హైపర్ ఆది కామెడీ అంతా ఎంటర్టైన్ చేస్తుంది. అయితే స్క్రీ ప్లే అంతా సింపుల్ గా అనిపిస్తుంది.
సినిమాలో కులం పై వచ్చే డైలాగ్స్ ఆలోచింపచేస్తాయి. అవసరానికి కుమల్ ఉండదు.. అవసరం ఉన్న చోట కులం ఉండదు. విద్య అనేది గుడిలో పెట్టే నైవేద్యం లాంటిది.. దాన్ని పంచి పెట్టండి అమ్మకండి.. ఇలా గురువు మీద వచ్చే డైలాగ్స్ ఇవన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే అన్నీ బాగున్నా కథ, కథనాలు ఆడియన్స్ ఊహించే విధంగా ఉంటాయే తప్ప కొత్తగా అనిపించవు.
అయినా సరే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు వెంకీ అట్లూరి సక్సెస్ అయ్యాడు. ధనుష్ వన్ మ్యాన్ షోతో సినిమాను నిలబెట్టాడు. ఈ కథకు ధనుష్ మాత్రమే పర్ఫెక్ట్ అనిపించేలా చేశాడు. సం యుక్త మీనన్ ఉన్నంతవరకు బాగానే చేసింది. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను.. స్టూడెన్స్ ని ఆకట్టుకునేలా ఉంటుంది.
నటీనటుల ప్రతిభ :
సార్ సినిమాలో బాలు పాత్రలో ధనుష్ తప్ప వేరొకరిని ఊహించడం కష్టం. ధనుష్ ఒంటి చేత్తో ఈ సినిమాను నడిపించాడు. సినిమాలో తన పాత్రతో మరోసారి తన సత్తా చాటాడు ధనుష్. ఇక సం యుక్త మీనన్ కూడా పరిధి మేరకు నటించి మెప్పించింది. హైపర్ ఆది తన పంచులతో అలరించాడు. సముద్రఖని, సాయి కుమార్, సుమంత్ వారి పాత్రలకు న్యాయం చేశారు.
జివి ప్రకాశ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. కెమెరా మెన్ పనితనం ఇంప్రెస్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. వెంకీ అట్లూరి ఒక మంచి కథ చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే రొటీన్ స్క్రీన్ ప్లే ట్విస్ట్ లు లేకపోవడం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది.
ప్లస్ పాయింట్స్ :
ధనుష్
జివి ప్రకాశ్ మ్యూజిక్
డైలాగ్స్
మైనస్ పాయింట్స్ :
ఊహించే కథనం
బాటం లైన్ :
ధనుష్ 'సార్' పాఠాలు నేర్చుకోవాల్సిందే..!
రేటింగ్ : 2.75/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: