అనుష్క వ్యాధి విషయంలో వస్తున్న వార్తల్లో అసలు నిజమెంత..!?

Anilkumar
ఇప్పటికే చాలామంది హీరోయిన్లు తమకున్న వ్యాధుల గురించి బయటపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే సమంత మయోసైటీస్ అనే  వ్యాధితో బాధపడుతుంది. సమంతనే కాకుండా రేణు దేశాయ్ కూడా గుండెకు సంబంధించిన ఒక వ్యాధితో బాధపడుతుంది అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ లిస్టులోకి చేరింది అనుష్క. ఏ స్టార్ హీరోయిన్ ని చూసిన వారికి ఏదో ఒక వ్యాధి ఉందని ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఏ స్టార్ హీరోయిన్ ని కలిపిన సరే వారికి ఏదో ఒక వ్యాధి ఉందని తెలుస్తోంది. అయితే అయితే అనుష్కకి కూడా ఒక అనారోగ్య సమస్య ఉందని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే .

అయితే అనుష్కకి ఉన్న వ్యాధి గురించి తెలిస్తే షాక్ అవుతారు. అది ఏంటి అంటే ..సాధారణంగా ఏదైనా నవ్వించే సంఘటన వస్తే నాన్ స్టాప్ గా 20 నిమిషాల వరకు నవ్వుతూనే ఉంటుందిట అనుష్క. అంతేకాకుండా  నవ్వుతున్నంతసేపు బాగానే ఉండి దాని తర్వాత బయటకు వెళ్లి స్నాక్స్ కూడా తినేసి వస్తుంది .ఈ నేపథ్యంలోనే ఈ వార్త విన్న చాలామంది ఇది కూడా ఒక వ్యాధి అయినా అంటూ కామెంట్లను చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ విషయాన్ని అనుష్క ఒక తమిళ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో అనుష్క బయటపెట్టిన ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వెళ్ళుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తల్లో నిజం లేదు అని తన సన్నిహితులు చెబుతున్నారు.

అనుష్క కి మీరందరూ అంటున్నట్టు అలాంటి వ్యాధులు ఏమీ లేవు అని తను బరువు పెరిగిన సమస్య మాత్రమే అనుష్కకి ఉందని ఇతర అనారోగ్య సమస్యలు ఏవి కూడా అనుష్కకి లేవని చెప్తున్నారు. అందరూ ఈ విషయాలపై స్పందిస్తున్నప్పటికీ అనుష్క మాత్రం ఇప్పటివరకు తన మీద వస్తున్న ఈ వార్తలపై ఇప్పటిదాకా స్పందించలేదు. ఇన్ని రోజులవుతున్నప్పటికీ అనుష్క ఈ వార్తలు పై స్పందించకపోవడంతో నిజంగానే అనుష్క ఏదైనా సమస్యతో బాధపడుతుంది కాబోలు అందుకే బయటకు వచ్చి ఈ విషయాలపై స్పందించట్లేదు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: