జయమ్మ పై మండి పడుతున్న తమిళ నెటిజన్స్....!!

murali krishna
ఈ మధ్య లేడీ విలన్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. కోలీవుడ్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తనలాంటి ప్రతిభ కలిగిన ఎంతో మంది నటీనటు లకు తమిళ ఇండస్ట్రీలో అస్సలు ఆదరణ దక్కట్లేదని వరలక్ష్మీ అనడం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయ్యింది.
నిజానికి, వరలక్ష్మీ శరత్ కుమార్ నటిగా మారింది తమిళ తెర మీదే. తమిళ మేకర్స్ కూడా ఆమెను ఎంతగా నో ఆదరించారు. కానీ, వరలక్ష్మీ శరత్ కుమార్ మాత్రం తెలుగు సినిమాల పై ఆసక్తి పెంచుకున్నారు అందుకే, ఆమె తమిళ ఇండస్ట్రీ పై విషం చిమ్ముతు న్నారని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్స్ ఇలా ఇలా కామెంట్స్ చేయడాని కి ఒక కారణం కూడా ఉంది. వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళ ఇండస్ట్రీ పై నెగిటివ్ కామెంట్స్ చేసి.. టాలీవుడ్‌ పై అమిత ప్రేమను కురిపించింది. ఇంతకీ వరలక్ష్మీ ఏం మాట్లాడింది అంటే. 'తెలుగు లో నాకు ఎంతో మంచి ఆదరణ దక్కుతుంది. తెలుగు ప్రేక్ష కులు నన్ను వారి కన్న బిడ్డగా ప్రేమి స్తున్నారు. అలాగే, తెలుగు ఫిల్మ్ మేకర్స్ కూడా నా కోసం విభిన్న క్యారెక్టర్స్ ను డిజైన్ చేస్తున్నారు' అని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పుకొచ్చింది.
పైగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంకా షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. తాను ఇక హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యే ప్లాన్‌లో ఉన్నానని కూడా తన మనసులో మాట బయట పెట్టింది. ఈ కామెంట్స్ పై కూడా తమిళ  నెటిజన్స్ ఆమె పై గుర్రుగా వున్నారట. పక్క భాష లో నాలుగు అవకాశాలు రాగానే నటిని చేసిన పరిశ్రమను కూడా మర్చిపో వడానికి, అలాగే వదిలిపోవడానికి సిద్ధ పడినందుకు నువ్వు ఎంతో సిగ్గు పడాలి' అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ పై బాగా కోప్ప డుతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: