నందమూరి తారకరామారావుని అనుసరిస్తున్న పవన్ కళ్యాణ్ !

Seetha Sailaja
శ్రీరాముడు శ్రీకృష్ణుడు పాత్రలకు పెట్టింది పేరు నందమూరి తారక రామారావు. ‘మాయాబజార్’ సినిమా విడుదల తరువాత తెలుగు ప్రజలు ఆరోజులలో శ్రీకృష్ణుడు రామారావు లా ఉంటాడని భావించేవారట. ఎన్టీఆర్ కూడ ఇలాంటి భగవంతుడి పాత్రలను పోషించేడప్పుడు తాను నటించే పాత్రలో పవిత్ర కనిపించడం కోసం కేవలం సాత్విక ఆహారాన్ని తీసుకోవడమే కాకుండా తన ఇంటిలో కటిక నెల పై పడుకునే వాడని ఎన్టీఆర్ గురించి చెపుతూ ఉంటారు.

ఇప్పుడు అలాంటి నీమాలను పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నాడు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హడావిడి చేస్తున్న ఈవార్తల ప్రకారం మరికొన్ని రోజులలో మొదలుకాబోతున్న ‘వినోదయ సితం’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచనల మేరకు తన హెయిర్ స్టైల్ ను మార్చుకోవడమే కాకుండా గత కొన్నిరోజులుగా కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటూ తాను పోషించే భగవంతుడి ఛాయలు ఉండే పాత్ర షూటింగ్ కోసం మానసికంగా సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈసినిమా షూటింగ్ ను వేగంగా పూర్తిచేసి వెంటనే తన వారాహి బస్సు యాత్రను ప్రారంభించి వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను పక్కాగా అమలు చేయాలని పవన్ ఆలోచన అని అంటున్నారు. వాస్తవానికి ఈమూవీకి రీమేక్ లో పవన్ ను ఒప్పించడానికి త్రివిక్రమ్ ఎన్నో సార్లు పవన్ ఇంటి చుట్టూ తిరగవలసి వచ్చిందని గాసిప్పులు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

గత కొన్ని సంవత్సరాలుగా పవన్ అనేక సినిమాలు లైన్ లో పెడుతున్నప్పటికీ గత సంవత్సరం విడుదలైన ‘భీమ్లా నాయక్’ మూవీ తప్ప మరొక సినిమా ఇప్పటివరకు విడుదలకాని విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల సంఖ్య పెరిగిపోతున్నప్పటికీ అతడు నటిస్తున్న సిమాలు ఈసంవత్సరం ఏనెల విడుదల అవుతాయో ఆమూవీని తీసిన నిర్మాతలకు కానీ అదేవిధంగా దర్శకుడుకు కానీ అవగాహన లేదు అంటూ మరికొందరు కామెంట్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: