ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతున్న మృణాల్ ఠాకూర్..!!

Divya
బాలీవుడ్లో హీరోయిన్గా పేరుపొందిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. గత ఏడాది వరకు కాస్త నెమ్మది గా సాగిన ఈమె కెరియర్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. గత ఏడాది బాలీవుడ్ లో విడుదలైన జెర్సీ సినిమాతో పాటు టాలీవుడ్ లో సీతారామం చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ముఖ్యంగా ఈమె కెరియర్ కు మలుపు తిప్పిన చిత్రాలు ఇవే అని చెప్పవచ్చు. దీంతో బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటోంది.

ప్రస్తుతం ఫుల్ జ్యూస్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ పలు ఈవెంట్లు, ఫ్యాషన్ షోలకు వెళ్తూ అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల డిజైనర్ అబూజాని సందీప్ ఖాన్ నిర్వహించిన ఫ్యాషన్ ఈవెంట్లు మెరవడం జరిగింది మృణాల్ ఠాకూర్. ముఖ్యంగా పెళ్లికూతురుగా..మృణాల్ ఠాకూర్ ముస్తాబయి ఆకట్టుకుంటుంది లెహంగా జోలీల కట్టిపడేసే అందంతో సాంప్రదాయమైన దుస్తులను ఈ ముద్దుగుమ్మ మెరిసిపోతోంది. అయితే ఈవెంట్లో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత చతుర్వేదితో కలిసి రాంప్ వాక్ చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.
మృణాల్ ఠాకూర్ సాంప్రదాయమైన దుస్తులను మెరిసిపోవడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషి గా ఉన్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగుందని ఫ్యాన్స్ పలువురు నెటిజన్స్ కూడా కామెంట్ చేయడం జరుగుతోంది.మృణాల్ ఠాకూర్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందు లో నాలుగు చిత్రాలు బాలీవుడ్ కి చెందినవే కావడం గమనాభం. ఇక టాలీవుడ్లో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తన 30వ సినిమాలో నటించబోతోంది. మరి ఏడాది కూడా ఈమె హవా కొనసాగిస్తుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా ఈర సాంప్రదాయమైన దుస్తులను మళ్లీ మైమరిపిస్తోంది మృణాల్ ఠాకూర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: