శంకర్ డైరెక్షన్ లో నటించే ఛాన్స్ మిస్ అయిన చిరంజీవి...!!

murali krishna
కోలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి డైరెక్టర్ శంకర్ సినిమా వస్తుంది అంటే మాత్రం దేశం మొత్తం కూడా ఆ సినిమా కోసం ఎంత గానో ఎదురుచూస్తూ ఉంటుంది.అలాంటి టాప్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న శంకర్ కెరియర్ స్టార్టింగ్ లో ఆయన చేసిన ఒకే ఒక్కడు సినిమాని మొదట చిరంజీవి తో చేద్దాం అని ప్లాన్ చేశాడట.
స్వతహా గా శంకర్ కి చిరంజీవి అంటే ఇష్టం ఉండటం వల్ల ఆయనతో సినిమా చేయాలని కూడా అనుకున్నాడు... కానీ అప్పటికే చిరంజీవి వరుస సినిమాల తో బాగా బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా చేయలేకపోయాడని తెలుస్తుంది..
ఆ సినిమా అర్జున్ చేసి భారీ హిట్ అందుకున్నాడు అయితే ఆ తర్వాత కూడా చిరంజీవి శంకర్ తో సినిమా చేయాలని చూసాడు కానీ ఇద్దరికీ అయితే వర్క్ అవుట్ కాలేదు...రోబో సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ నా తో రజినీకాంత్ చెప్పాడు శంకర్ తో ఒక సినిమా అయిన చేయి అని శంకర్ సినిమా ఎప్పుడు చేద్దాం అంటే అప్పుడు నేను రెడీ అంటూ కూడా చెప్పాడు. ప్రస్తుతం శంకర్ వరుస ప్లాప్ ల్లో అయితే ఉన్నాడు.ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని కూడా చూస్తున్నాడు శంకర్... చిరంజీవి ఈ విషయం మీద స్పందిస్తూ నాతో సినిమా చేయాల్సి న శంకర్ నా తో మిస్ అయినప్పటికీ కూడా రామ్ చరణ్ తో సినిమా చేయడం నాకు ఎంతో సంతోషం గా ఉంది అని తన సన్నిహితుల దగ్గర చెప్తున్నట్టు సమాచారం....అయితే చిరంజీవి  అప్పట్లో ఒకే ఒక్కడు సినిమా తీసి ఉంటే చిరు కెరియర్ లో ఒక భారీ బ్లాక్ బస్టర్ సినిమా గా అయితే నిలిచిపోయేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: