ఓటీటీ లోకి సుడిగాలి సుదీర్ గాలోడు.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

Divya
సుడిగాలి సుదీర్ తాజాగా హీరోగా నటించిన చిత్రం గాలోడు. సుధీర్ హీరోగా పులిచెర్ల రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 18వ తేదీన విడుదలై అన్ని థియేటర్లలో బాగా ప్రేక్షకుల మన్ననలు పొందింది.. లాంగ్ రన్ లో ఈ చిత్రం సుమారు రూ.10 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో సుధీర్ సరసన గెహన సిప్పి హీరోయిన్గా నటించి తన అందచందాలతో మెప్పించింది. బీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా గత ఏడాది విడుదలైన హిట్ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది..
ఇదిలా  ఉండగా తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా సొంతం చేసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసింది.  ఈ క్రమంలోని ఫిబ్రవరి 17 నుంచి ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది అని సమాచారం.. జబర్దస్త్ కమెడియన్గా సుధీర్ తన కెరీర్ ను మొదలుపెట్టారు ఆ తర్వాత హీరోగా మారి సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో వెండితెర పైకి వచ్చిన ఈయన పలు సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు.  అయినా కూడా సాలిడ్ హిట్ ఒక్కటి కూడా పడలేదు . అలాంటి సమయంలో మాస్ ఎంటర్టైనర్ మూవీ నేపథ్యంలో గాలోడు సినిమా వచ్చింది.

మొదటి రోజే ఈ సినిమా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఇందులో సుధీర్ నటనకు  మాస హీరోగా పేరు కూడా అందించింది మొత్తానికైతే ఈ సినిమా సుధీర్ సినీ కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతుంది.. మొత్తానికి అయితే ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఇప్పుడు ఓటీటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓటిటి ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుంది అనేది చూడాలి మొత్తానికైతే సుధీర్ తన సినీ కెరియర్ను పదిలం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: