బాలకృష్ణ "వీర సింహారెడ్డి"అఫీషియల్ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మించినటువంటి వీర సింహారెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... హనీ రోజ్ ఈ మూవీలో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో దునియా విజయ్ ... వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించగా తమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు.

ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల విడుదల అయ్యింది. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే మంచి విజయం అందుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా మెరబడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది.
 

అందులో భాగంగా ఈ మూవీని ఫిబ్రవరి 23 వ తేదీ న సాయంత్రం 6 గంటల నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" లో ఈ మూవీ ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దామని మిస్ అయిన వారు ఉంటే ఫిబ్రవరి 23 వ తేదీ నుండి ఈ సినిమా డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: