నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రీరిలీజ్ కి రెడీ అవుతున్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ..?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. సందర్భం తో సంబంధం లేకుండా అగ్ర హీరోల సినిమాలు ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ అవుతున్నాయి. ఈ పాత సినిమాలు కొత్త సినిమాల కంటే కూడా ఎక్కువ వసూలు సాధిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు రీరిలీజైన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'అదుర్స్' సినిమాని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో ఈ సినిమాని 4k వెర్షన్ లో రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుందని అంటున్నారు. 

డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాని ట్తెరకెక్కించగా ఎన్టీఆర్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన దృశ్యాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా హీరోయిన్స్ గా నటించగా.మ్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.  ఇక ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ సినిమా ఒక స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే గత చిత్రాల కన్నా ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉంది.

ఇప్పటికే మహేష్ బాబు నటించిన పోకిరి, ఒక్కడు.. పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, ఖుషి చిత్రాలు రీరిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ మూవీ కూడా రిరిలీజ్ అవుతుందనే వార్త తెలిసి నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాకుండా ఖచ్చితంగా ఈ సినిమా రి రిలీజ్ అయితే రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని చెబుతున్నారు. కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: