వినోదయ సీతం రీమిక్ లో సాయి ధరమ్ తేజ్ సరసన ఆ యంగ్ బ్యూటీ..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సాయి దరమ్ తేజ్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. సాయి తేజ్ ఆఖరుగా దేవా కట్ట దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది.

ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ ... సాయి తేజ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ... కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న విరూపాక్ష అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే సాయి తేజ్ మరి కొన్ని రోజుల్లో వినోదయ సీతం అనే తమిళ మూవీ కి రీమేగా తెరకెక్కబోతున్న మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సముద్ర ఖని దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో సాయి దరమ్ తేజ్ సరసన యంగ్ హాట్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటించబోతున్నట్లు , మరి కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: