ఆ దర్శకుడికి.. చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడా?

praveen
చిరంజీవి తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు   హీరోగా పరిచయమైన రామ్ చరణ్ తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక జక్కన్న దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా అటు రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక రాంచరణ్ నెక్ట్ ప్రాజెక్టులపై ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న రాజమౌళితో ఇప్పటికే సినిమా చేసిన చరణ్.. ఇక ఇప్పుడు అటు శంకర్తో సినిమాకు రెడీ అయ్యాడు.

 ఆర్సి15 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే శంకర్ సినిమా కావడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే దానిపై కూడా ఎన్నో ఊహగానాలు తరచూ ఇండస్ట్రీలో హార్ట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయని చెప్పాలి. అయితే ఒకవైపు శంకర్ సినిమాతో బిజీగా ఉన్న చరణ్.. మరోవైపు వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనాకి ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించేందుకు సిద్ధమైంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కిపోతుందట.

 అయితే ఇలా తన 16వ సినిమా ఇంకా ప్రారంభం కానేలేదు. అప్పుడే 17వ సినిమాకి చరణ్ పచ్చ జెండా ఊపేసాడట. నర్తన్ దర్శకత్వంలో ఇక ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్లు ఒక టాక్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చరణ్ పుట్టినరోజు మార్చ్ 27వ తేదీన ఇక ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి.  ఇక ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే మరి. కాగా ప్రస్తుతం చరన్ నటిస్తున్న ఆర్సి 15 సినిమాలో మెగా హీరో సరసన బాలీవుడ్ భామ కియారా హీరోయిన్గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: