జూనియర్ మాటలకు అర్ధాలు వెతుకుతున్న విశ్లేషకులు !

Seetha Sailaja
ఫిలిం ఫంక్షన్స్ కు వచ్చినప్పుడు సాధారణంగా జూనియర్ నవ్వుతూ ఉంటాడు. అవకాశం వచ్చినప్పుడల్లా తనకు ఎదో జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల తాను నందమూరి తారకరామారావు మనవడుగా పుట్టానని తన అభిమానులు లేకపోతే తాను లేను అని అనడమే కాకుండా వారి అభిమానానికి జన్మజన్మల రుణపడి ఉంటాను అంటూ మాట్లాడటం జూనియర్ అలవాటు.

అయితే ఈ తీరుకు భిన్నంగా తారక్ ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కనిపించడమే కాకుండా తన అభిమానులకు చిన్నగా క్లాస్ పీకి తన లేటెస్ట్ సినిమాల అప్ డేట్స్ గురించి టెన్షన్ పడవద్దనీ ఆవిషయాలు ఏమైనా ఉంటే తన భార్య కంటే ముందుగా తన అభిమానులకు చెపుతానని కొన్ని చురకలు వేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ‘అమిగోస్’ మూవీ ఫంక్షన్ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానిది.

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈమూవీ ఫంక్షన్ లో తారక్ ఎందుకు అంత మూడీగా కనిపించాడు అంటూ మరికొందరు ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఆ ఫంక్షన్ జరిగిన రోజు తనకు ఆరోగ్యం బాగాలేదని అయినప్పటికీ తన అన్న కళ్యాణ్ రామ్ కోసం తాను ఒళ్ళు నొప్పులుగా ఉన్నా తాను వచ్చాను అంటూ ఓపెన్ గా చెప్పిన విషయం తెలిసిందే. దీనికితోడు ఆరోజు యాంకర్ సుమ జూనియర్ ను వేదిక పైకి ఆహ్వానించే సమయంలో చేసిన హడావిడి కూడ అతడికి నచ్చకపోవడంతో సుమ భర్తతో తనకున్న సాన్నిహిత్యం రిత్యా కొన్ని చురకలు వేసిన విషయం తెలిసిందే.

అయితే తారక్ ఇలా మూడీగా ఉండటానికి మరొక కారణం ఉండవచ్చు అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ లో తాను నటించిన ‘కొమరం భీమ్’ పాత్రకు తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా బాలీవుడ్ లో ప్రేక్షకుల నుండి పెద్దగా ప్రశంసలు రాకపోయినప్పటికీ హాలీవుడ్ మీడియా ‘ఆర్ ఆర్ ఆర్’ గురించి వ్యాసాలూ వ్రాస్తున్నప్పుడల్లా తారక్ నటన గురించి ప్రశంసలు కురిపిస్తూ అతడిని ఆస్కార్ ఉత్తమ నటుడి ప్యానల్ లో స్థానం దక్కడం ఖాయం అంటూ ఊహాగానాలు చేసాయి. అయితే ఆ ఊహలకు భిన్నంగా జూనియర్ కు ఆస్కార్ అవార్డ్ ప్యానల్ లో స్థానం లభించలేదు. ఇలా రకరకాల కారణాలతో జూనియర్ అసహనానికి లోనై ఉంటాడు అంటూ మరికొందరి ఊహ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: