ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 'వీరసింహరెడ్డి' ఆల్ టైం రికార్డ్..?

Anilkumar
నటసింహ నందమూరి బాలకృష్ణకు మాస్ ఆడియన్స్ లో ఉండే క్రేజే వేరు. సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన సినీ ఇండస్ట్రీలో భారీ స్టార్ డంతో కొనసాగుతున్నారు.ఇన్నేళ్ల కెరియర్ లో ఆయన తన సినిమాలతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. మళ్లీ ఆ రికార్డులను తానే బ్రేక్ చేశాడు. చాలా సందర్భాల్లో ఇది జరిగింది. ఆరుపదుల వయసున్నా.. యువ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే తాజాగా మరో అరుదైన ఘనతను సాధించాడు. ఈ సంక్రాంతికి 'వీరసింహారెడ్డి' గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలయ్య. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. 

మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం పోషించారు. శృతిహాసన్ హీరోయిన్గా నటించగా తమన్ సంగీతం అందించాడు. ఇక సినిమాలో వీరసింహారెడ్డిగా మరోసారి నట విశ్వరూపం చూపించాడు బాలయ్య. ఎప్పటిలాగే తన మేనరిజం, పవర్ ఫుల్ డైలాగ్స్ తో థియేటర్స్ దద్దరిల్లేలా చేశాడు. ఈ సినిమా కూడా బాల్య కెరీర్లో ఓ మెమరబుల్ మూవీ గా మిగిలిపోతుంది అనడంలో ఇలాంటి సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ మంచి కలెక్షన్స్ ని రాబడుతున్న ఈ సినిమా తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెయిన్ థియేటర్ సంధ్యా 35MM లో ఫిబ్రవరి 8 నాటికి అంటే కేవలం 28 రోజుల్లో కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

గతంలో ఇదే క్రాస్ రోడ్స్ లో నరసింహనాయుడు, అఖండ సినిమాలు కోటి రూపాయల గ్రాస్ రాబట్టాయి. దీంతో ఇప్పుడు వీర సింహారెడ్డి తో హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య. తెలుగు ఇండస్ట్రీలోని ఈ రేర్ రికార్డు కేవలం బాలయ్యకు మాత్రమే సాధ్యమైంది. దీంతో నందమూరి ఫాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. ఇక ఇది ఆల్ టైం రికార్డ్ అని కూడా చెబుతున్నారు. గత ఏడాది అఖండ సినిమా 53వ రోజు కోటి రూపాయల మార్కుని అందుకోగా.. తాజాగా వీరసింహారెడ్డి మాత్రం కేవలం 28 రోజుల్లోనే ఆ ఘనతను సాధించింది. మొత్తంగా 28 రోజుల్లో ఈ సినిమా రూ.కోటి 18 వేలకు పైగా గ్రాస్ వసూలు చేసింది.ఇక ఈ రికార్డ్ తో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: